క్రీడాభూమి

నా జీవితంలో చీకటి రోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, కోచ్ రమేష్ పోవర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. వెస్టిండీస్‌లో జరిగిన మహిళల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో మిథాలీకి చోటు కల్పించకపోవడం బహిరంగ చర్చకు కారణమైన విషయం తెలిసిందే. బ్యాటింగ్ ఆర్డర్‌పై మిథాలీ పట్టుబట్టిందని, ఆమె వైఖరి సరిగ్గా లేదని పోవర్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. కాగా, అతని వ్యాఖ్యలపై మిథాలీ తీవ్రంగా స్పందించింది. తన జీవితంలో ఇది చీకటి రోజుగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించింది. సుమారు రెండు దశాబ్దాలు దేశానికి సేవలు అందించానని, ఇప్పుడు తన నిజాయితీని నిరూపించుకోవాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది. దేశం కోసం తాను ఎంతో శ్రమించానని, చెమట చిందించానని ఆమె ట్వీట్ చేసింది. ఇనే్నళ్ల తర్వాత తన దేశభక్తిని శంకించడాన్ని మించిన దౌర్భాగ్యం మరొకటి లేదని పేర్కొంది. మిథాలీ జట్టులో లేని కారణంగా సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైనందన్న విమర్శలు ఉన్నాయి. అయితే, అది పొరపాటు నిర్ణయం కాదని నిరూపించుకోవడానికి పోవర్ నానా తంటాలు పడుతున్నాడు. అందులో భాగంగానే మిథాలీపై విమర్శలు గుప్పించాడు.