క్రీడాభూమి

టెస్టు క్రికెట్ మనుగడ కోహ్లీతోనే సాధ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 30: టెస్టు క్రికెట్ మనుగడ సాధిస్తూ పురోగమిస్తోందంటే దానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే కారకుడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ అభిప్రాయపడ్డాడు. టీ-20 సిరీస్‌లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత తరుణంలో టెస్టు క్రికెట్ మరింత మనుగడ సాధించేందుకు కోహ్లీ సాధిస్తున్న రికార్డులు ఎంతో దోహదపడుతున్నాయని అన్నాడు. లీగ్ పోటీలతోపాటు పరిమిత ఓవర్ల క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వంటివాటిపైనే ఎక్కువగా దృష్టి సారిస్తూ టెస్టు క్రికెట్‌పై అంతగా ఆసక్తి చూపని నేపథ్యంలో దీనికి గల ప్రాధాన్యతను గుర్తెరిగిన కోహ్లీ టెస్టుల్లో సాధిస్తున్న ప్రగతి విశ్వవ్యాప్తమవుతోందని పేర్కొన్నాడు. ఒకప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్, దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లకు అధిక శాతం హాజరయ్యే ప్రేక్షకులు ఇపుడు టెస్టు మ్యాచ్‌లవైపు దృష్టి సారిస్తున్నారంటే అందుకు ప్రధాన కారకుడు టీమిండియా కెప్టెన్ కూడా ఒకడని అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్‌ను అమితంగా ప్రేమించే, అభిమానించే వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఐదు రోజుల వ్యవధి గల అద్భుతమైన గేమ్‌కు ప్రాచుర్యం కల్పించడంలో ఎంతో దోహదపడ్డాడనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నాడు. ప్రస్తుతం ఆసిస్ టూర్‌లో ఉన్న టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న విరాట్ కోహ్లీ టెస్టు సిరీస్‌లను చేజిక్కించుకుంటే సరికొత్త రికార్డులను సాధించినవాడు అవుతాడని పేర్కొన్నాడు. భారత్ ఇంతవరకు ఆస్ట్రేలియా ఆడిన 11 టెస్టు సిరీస్‌లో ఎన్నడూ గెలిచిన దాఖలాలు లేవని, ఇపుడు కోహ్లీ దానిని తిరగరాసే అవకాశం లేకపోలేదని అన్నాడు.