క్రీడాభూమి

అశ్విన్ సత్తా చాటుతాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, డిసెంబర్ 3: ఈనెల 6 నుంచి ఆతిథ్య ఆస్ట్రేలియాతో తలపడే నాలుగు టెస్టు సిరీస్‌లలో తమ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తప్పకుండా సత్తా చాటుతాడనే గట్టి నమ్మకం ఉందని టీమిండియా బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా అన్నాడు. అడెలైడ్‌లో గురువారం నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పీటీఐ ప్రతినిధితో మాట్లాడాడు. తమ టీమ్‌లో సహచర సభ్యుడైన అశ్విన్ తెలివైన బౌలర్ అని, ఆరంభ టెస్టు సిరీస్‌లోనే తన సత్తా ఏమిటో రుజువు చేసుకుంటాడనే తాను బలంగా విశ్వసిస్తున్నానని పేర్కొన్నాడు. జట్టులో ఎంతో అనువజ్ఞుడైన అశ్విన్ ఆఫ్‌స్పిన్‌లో ఎంతో పరిణితిగల క్రికెటర్ అని, ప్రత్యర్థిని ఏవిధంగా కట్టడి చేసేందుకు అతని వద్ద ఎన్నో ట్రిక్స్ ఉన్నాయని అన్నాడు. అశ్విన్ ఇంతవరకు ఆస్ట్రేలియా గడ్డపై 6 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉందని, వాటిలో 54.72 సరాసరిన 21 వికెట్లు తీసుకున్నాడని అన్నాడు. గతంలో కంటే అశ్విన్ బౌలింగ్‌లో మరింత రాటుదేలాడని, అతని బౌలింగ్ సామర్థ్యంలో ఎన్నో మార్పులు జరిగాయని అన్నాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ టూర్‌లో అశ్విన్ అద్భుతంగా రాణించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇంగ్లాండ్ మైదానానికి, ఆస్ట్రేలియా వాతావరణ పరిస్థితులకు భిన్నంగా ఉన్నా, తన పదునైన బౌలింగ్ ప్రతిభతో ప్రత్యర్థిని కట్టడి చేయగల సత్తా ఉన్నవాడని పేర్కొన్నాడు. ఆసిస్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో తమ బౌలర్లు 500కు పైగా పరుగులు సమర్పించుకున్నా టెస్టుల్లో ఇది మామూలేనని అన్నాడు.

చిత్రం.. టీమిండియా బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా