క్రీడాభూమి

క్రికెట్‌కు గౌతమ్ గంభీర్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు మంగళవారం వెల్లడించాడు. ‘ఆటతో అనుంబంధానికి ముగింపు పలికే సమయం వచ్చింది. 15 ఏళ్లపాటు దేశం తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడిన నేను ఈ అందమైన ఆట నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను’ అని ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన ఒక వీడియోలో పేర్కొన్నాడు. 37 ఏళ్ల ఢిల్లీ బ్యాట్స్‌మన్ గంభీర్ తన కెరీర్‌లో 2004 నుంచి 2016 మధ్య కాలంలో 58 టెస్టులు ఆడాడు. 41.95 సగటున 4154 పరుగులు చేశాడు. ఇందులో 9 శతకాలు, 22 అర్థ శతకాలు ఉన్నాయి. అంతేకాకుండా 2003 నుంచి 2013 వరకు 147 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 5238 పరుగులు, 37 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 932 పరుగులు చేశాడు. టీమిండియా రెండుసార్లు ప్రపంచ కప్‌ను సాధించడంలో ఈ దిగ్గజ ఆటగాడు కీలక భూమిక పోషించాడు. గురువారం ఆంధ్రప్రదేశ్ జట్టుతో తలపడే రంజీ ట్రోఫీ ఆఖరి మ్యాచ్ అని పేర్కొన్నాడు. టీమిండియా ఆటగాళ్లలో మంచి దూకుడుతో ఆడే ఈ ఓపెనర్ దక్షిణాఫ్రికాలో జరిగిన 2007 వరల్డ్ టీ-20, 2011 వనే్డ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ రెండు సిరీస్‌లలోనూ టీమిండియాదే విజయం. కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.