క్రీడాభూమి

ఆస్ట్రేలియానే.. ఫేవరిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, డిసెంబర్ 4: ఆస్ట్రేలియా-భారత్ మధ్య అడెలైడ్ వేదికగా ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో ఆతిథ్య జట్టే ఫేవరిట్ అని టీమిండియా వైస్‌కెప్టెన్ అజింక్య రహానే అన్నాడు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తొలి టెస్టులో విజయం సాధించేందుకు ఆసిస్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనడానికి గల కారణాలను విశే్లషించాడు. ఇంతవరకు భారత్‌తో జరిగిన అన్ని టెస్టుల్లోనూ ఆతిథ్య ఆసిస్ విజయాలను నమోదు చేసిందని అన్నాడు. స్వదేశంలో జరుగుతున్న టెస్టుపై సహజంగానే స్థానిక ఆటగాళ్లకు మంచి పట్టు ఉంటుందని, వాతావరణ పరిస్థితులు, పిచ్ వంటివి వారికి బాగా కలిసొచ్చే అంశాలు అని పేర్కొన్నాడు. ఆసిస్ జట్టులో దిగ్గజ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ వంటివారు లేకున్నా బలమైన బౌలింగ్ సామర్థ్యం గల ఆటగాళ్లు ఉండడంతో వారు టీమిండియా బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని అన్నాడు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి ఆటగాళ్లను తాము తేలికగా తీసుకోదలచుకోలేదని అన్నాడు. అయితే, భారత్ చాలాకాలం తర్వాత ఆసిస్ గడ్డపై టెస్టు సిరీస్‌లు ఆడుతున్నందున బ్యాటింగ్‌లోకి దిగే భాగస్వామ్యం క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకుంటే గెలుపు అవకాశాలు సాధ్యమేమీ కాదని అన్నాడు. 2014-15 సీజన్‌లో మెల్బోర్న్‌లో విరాట్‌కోహ్లీతో కలసి 262 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. అయితే, ఆసిస్ బ్యాట్స్‌మెన్‌ల గురి అంతా భారత బ్యాట్స్‌మెన్‌లలోని కీలక వ్యక్తులపైనేనని, వారిపైనే ఎక్కువగా వారు దృష్టిని కేంద్రీకరిస్తారని పేర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా భాగస్వామ్యం సమర్థవంతమైన పాత్రను పోషించాల్సిన అవసరాన్ని గుర్తు చేశాడు. ప్రత్యర్థి బౌలర్ ఎలాంటివాడైనా ధీటుగా ఎదుర్కొనేందుకు తద్వారా పరుగుల వరద పారించేందుకు బలమైన భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నాడు. బలమైన భాగస్వామ్యంతో క్రీజులో నిలదొక్కుకుంటే ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటే సిరీస్ గెలుపు అసాధ్యమేమీ కాదని అన్నాడు. మెల్బోర్న్‌లో విరాట్ కోహ్లీతో కలసి సాధించిన భారీ భాగస్వామ్యాన్ని ఎంతో ఆస్వాదించామని అన్నాడు. ప్రతి బ్యాట్స్‌మన్ కూడా తమ సహజమైన ఆటతీరుతో జట్టు గెలుపు కోసం సమర్థవంతమైన పాత్రను పోషించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ టూర్‌లలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ (విరాట్ కోహ్లీ మినహా) ఆశించిన రీతిలో ఆడకపోవడంతో క్రికెటర్ల వైఫల్యంపై ఎన్నో విమర్శలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లను తాము చాలెంజ్‌గా తీసుకున్నామని, కానీ అక్కడి వాతావరణ పరిస్థితులు తమ పర్యాటక జట్టుకే కాకుండా ఆతిథ్య టీమ్ అనుకూలంగా లేని విషయాన్ని గమనార్హమని అన్నాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లోని ఆఖరి టెస్టు ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టులోని అలాస్టర్ కుక్ మినహా మిగిలినవారెవరూ భారీ స్కోరు సాధించలేకపోయిన విషయాన్ని పేర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో విమర్శలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా సహజమైన ఆటతీరుపైనే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ టూర్‌లతో బేరీజు వేసుకుంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌లో తాము ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు అన్నివిధాల కృషి చేస్తామని పేర్కొన్నాడు.

చిత్రం..తొలి టెస్టుపై టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే వ్యాఖ్య