క్రీడాభూమి

క్వార్టర్ ఫైనల్స్‌లో బెర్త్ కోసం తహతహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 7: ప్రపంచ హాకీలో ప్రస్తుతం 5వ స్థానంలో ఉన్న భారత్ శనివారం కెనడాతో జరిగే పోరులో గెలుపు ద్వారా క్వార్టర్ ఫైనల్స్‌లో బెర్త్‌ను ఖరారు చేసుకునేందుకు తహతహలాడుతోంది. ఫైనల్ పూల్-సీ మ్యాచ్‌లో కెనడాతో తలపడనున్న భారత్ ఇప్పటికే రెండు జట్లతో గెలుపుతో 4 పాయింట్లతో ఉంది. బెల్జియం కూడా 4 పాయింట్లతో ఉండడంతో భారత్‌కు కెనడాతో జరిగే మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. భారత్ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 5-0తో ఓడించగా, బెల్జియంతో జరిగిన రెండో మ్యాచ్ 2-2గా డ్రా అయింది.
ప్రస్తుతం కెనడా కంటే భారత్ పాయింట్లపరంగా పైచేయిలో ఉండడంతో గెలుపునకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు కెనడాతో శనివారం జరిగే మ్యాచ్‌లో విజయం సాధించేందుకు తగిన చక్కని ప్రణాళికతో ముందుకు సాగుతామని భారత హాకీ జట్టు కోచ్ హరీందర్ సింగ్ తెలిపాడు.