క్రీడాభూమి

కంగారెత్తించారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాతో అడెలైడ్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో తక్కువ స్కోరుకే అలౌటైన భారత్ రెండో రోజు పైచేయ సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 250 ఫరుగులతో రెండోరోజు ఆటను ప్రారంభించిన కోహ్లీ సేన అదనంగా ఒక్క పరుగు కూడా చేయకుండానే ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్ బ్యాట్స్‌మెన్‌ను టీమిండియా బౌలర్లు ‘కంగారు’ పెట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 191/7తో నిలవగా, ఇంకా 59 పరుగులు వెనుకబడింది.
*
ఆడెలైడ్, డిసెంబర్ 7: భారత్-ఆస్ట్రేలియా మధ్య అడెలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు టీమిండియా బౌలర్లు ఆటపై ఆధిపత్యం చెలాయించారు. తొలిరోజు తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయిన భారత్ 250 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు ఆటను ప్రారంభించిన కోహ్లీ సేన పరుగుల ఖాతా తెరవకుండానే ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన ఆతిధ్య ఆసిస్ ఆట ముగిసేసరికి 88 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. భారత్‌పై పైచేయి సాధించాలంటే ఆస్ట్రేలియా ఇంకా మరో 59 పరుగులు చేయాల్సి ఉంటుంది. తొలి ఇన్నింగ్స్‌లో మొదటి, రెండు రోజుల్లో భారత్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించి బౌలింగ్‌లో విజృంభించిన ఆతిధ్య జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో సైతం బ్యాట్స్‌మెన్లు అదే దూకుడును ప్రదర్శిస్తారని క్రీడా పండితుల అంచనాలు పటాపంచలు చేశారు. ఆట ముగిసేసరికి ఆసిస్‌లో ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్ 61, 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3/50, ఇషాంత్ శర్మ 2/31, జస్ప్రీత్ బుమ్రా 34/2 వికెట్లు పడగొట్టారు.
రెండోరోజు తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆతిధ్య జట్టు ఓపెనర్ అరోన్ ఫించ్‌ను ఇషాంత్ శర్మ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 3 బంతులు ఎదుర్కొన్న ఫించ్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ దారిపట్టాడు. రెండో ఓపెనర్ మార్కస్ హారిస్ 57 బంతులు ఎదుర్కొని 3 బౌండరీలతో 26 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో మురళీ విజయ్‌కి క్యాచ్ ఇచ్చాడు. 19 బంతులు ఎదుర్కొన్న షాన్ మార్ష్ 2 పరుగులు చేయగా, అతనిని రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఉస్మాన్ ఖవాజా 125 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతో 28 పరుగులు చేసి, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. పీటర్ హ్యాండ్‌కాంబ్ 93 బంతులు ఎదుర్కొని 5 బౌండరీలతో 34 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. కెప్టెన్-వికెట్ కీపర్ టిమ్ పైన్ 20 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతో 5 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. 47 బంతులు ఎదుర్కొన్న పాట్ కమిన్స్ 10 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. రెండోరోజు ఆట ముగిసేసరికి ట్రావిస్ హెడ్ 61 పరుగులతో, మిచెల్ స్టార్క్ 8 పరుగులతో బరిలో ఉన్నారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 33 ఓవర్లలో 50 పరుగులిచ్చి 3, ఇషాంత్ శర్మ 15 ఓవర్లలో 31 పరుగులిచ్చి 2, జస్ప్రీత్ బుమ్రా 20 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నారు.