క్రీడాభూమి

రెండో వనే్డలో భారత్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడిలైడ్, జనవరి 16: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వనే్డ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో వనే్డలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లు కోల్పోయ, 298 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో షాన్ మార్ష్ (131) సెంచరీ రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు, మహ్మద్ షమీ మూడు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు. అనంతరం 299 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్లు చక్కటి శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 47 పరుగుల భాగ స్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత శిఖర్ ధావన్ (32) బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో ఖాజాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే బాధ్యత భుజాన వెసుకున్నాడు. మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి మంచి ఫాంలో ఉన్న రోహిత్ శర్మ (43) స్టొయనిస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత అంబటి రాయుడు (24) కొద్దిసేపటికే అవుట్ కాగా, మాజీ కెప్టెన్ మహీంద్రసింగ్ ధోనితో కలిసి విరాట్ చెలరేగాడు. ఈ క్రమంలోనే విరాట్ (104) సెంచరీ చేసి నిష్క్రమించగా, ధోని (55) మరో ఎండ్‌లో ఉన్న దినేష్ కార్తీక్ (25) సాయంతో మ్యాచ్‌ను ముగించాడు. ఆసీస్ బౌలర్లలో జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, జే రిచర్డ్‌సన్, మార్కస్ స్టొయనిస్, గ్లేన్ మ్యాక్ సవెల్ కు తలో వికెట్ లభించింది.
స్కోర్ బోర్డు సంక్షిప్తంగా:
ఆస్ట్రేలియా: షాన్ మార్ష్ 131, గ్లేన్ మ్యాక్ సవెల్ 48
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 45/4, మహ్మద్ షమీ 58/3, రవీంద్ర జడేజా 49/1
భారత్: విరాట్ కోహ్లీ 104, మహీంద్రసింగ్ ధోనీ (55)
బౌలింగ్: జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ 52/1, జే రిచర్డ్‌సన్ 59/1, గ్లేన్ మ్యాక్ సవెల్ 16/1, మార్కస్ స్టొయనిస్ 46/1.