క్రీడాభూమి
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ ప్రీ క్వార్టర్స్‌కు ఫెదరర్, నాదల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెల్బోర్న్, జనవరి 18: డిఫెండింగ్ చాంపియన్, స్విట్జర్లాండ్ వీరుడు రోజర్ ఫెదరర్, ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు రాఫెల్ నాదల్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మూడో రౌండ్‌లో తమతమ ప్రత్యర్థులను ఓడించి, ప్రీ క్వార్టర్ ఫైనల్స్ చేరారు. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన ఫెదరర్ 6-2, 7-5, 6-2 ఆధిక్యంతో టేలర్ ఫ్రిట్జ్‌పై గెలుపొందాడు. అతను తర్వాతి మ్యాచ్‌లో స్ట్ఫోనెస్ సిట్సిపాస్‌ను ఢీ కొంటాడు. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో సిట్సిపాస్ 6-3, 3-6, 7-6, 6-4 తేడాతో నికొలొజ్ బాసిలాష్‌పై విజయం సాధించాడు. నాదల్ 6-1, 6-2, 6-4 స్కోరుతో 27వ ర్యాంకర్ అలెక్స్ డి మినార్‌ను ఓడించి ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. అతను క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం కోసం థామస్ బెర్డిచ్‌తో తలపడతాడు. బెర్డిచ్ మూడో రౌండ్‌లో 18వ ర్యాంక్ ఆటగాడు డిగో స్వార్ట్‌మన్‌పై 5-7, 6-3, 7-5, 6-4 తేడాతో విజయాన్ని నమోదు చేశాడు. గ్రిగర్ దిమిత్రోవ్ 7-6, 6-4, 6-4 తేడాతో థామస్ ఫాబియానోపై గెలుపొంది, ఫ్రానె్సస్ తియాఫోతో నాలుగో రౌండ్ మ్యాచ్‌ని ఖాయం చేసుకున్నాడు. తియాఫో 6-7, 6-3, 4-6, 6-4, 6-3 స్కోరుతో ఆండ్రియాస్ సిప్పీపై గెలిచాడు.