క్రీడాభూమి

వన్డే సిరీస్ మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జనవరి 18: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా విజయం పరిపూర్ణంగా ముగించింది. మెల్‌బోర్న్ మైదానంలో శుక్రవారం జరిగిన మూడు వన్డేల్లో చివరిది, మూడోది అయిన కీలక మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌లో, యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో విజృంభించడంతో, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సేన అద్భుత విజయాన్ని అందుకోవడం ద్వారా ద్వైపాక్షిక సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసిస్ మైదానంలో ఇంతవరకు ఆడిన ఏ భారత జట్టు కూడా సాధించని ఘనతను టీమిండియా సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా తొలుత తలపడిన టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌ను 1-1తో సమం చేసిన కోహ్లీ సేన ఆ తర్వాత జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను సైతం 2-1తో గెల్చుకుంది. ఇపుడు తాజాగా జరిగిన మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్‌లో సైతం 2-1తో ప్రత్యర్థిపై పైచేయి సాధించి విదేశీ గడ్డపై భారత పతాకాన్ని సగర్వంగా ఎగిరేలా చేసింది. మెల్‌బోర్న్‌లో శుక్రవారం ఇరు జట్ల మధ్య జరిగిన అత్యంత కీలకమైన ఆఖరి వనే్డలో టీమిండియా గెలుపులో దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్, వికెట్ కీపర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తన మాయతో జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక భూమిక పోషించాడు. బౌలింగ్‌లో మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్ చెలరేగి 6 వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకు పుట్టించాడు. ఆఖరి వనే్డలో కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం సమయోచితంగా ఆడి జట్టు గెలుపునకు తన వంతు పాత్రను పోషించాడు.
తొలుత టాస్ గెలిచిన కోహ్లీ సేన ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి వనే్డలో అద్భుత విజయాన్ని అందుకున్న అరోన్ ఫించ్ సేన రెండో మ్యాచ్‌ను కోల్పోయినప్పటికీ అత్యంత కీలకమైన మూడోది, ఆఖరి వనే్డను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడింది. 49.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 231 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 49.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 234 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుని సిరీస్‌ను కైవసం చేసుకుంది.
వికెట్ కీపర్ అలెక్స్ కారే 11 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతో 5 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 24 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ అరోన్ ఫించ్ 1 బౌండరీతో 14 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ చేతిలో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. షాన్ మార్ష్ 54 బంతులు ఎదుర్కొని 2 బౌండరీలతో 39 పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో ధోనీ చేతిలో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 51 బంతులు ఎదుర్కొన్న ఉస్మాన్ ఖాజా 2 బౌండరీలతో 34 పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చాడు. మార్కస్ స్టోయిన్‌సిస్ 20 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతో 10 పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 19 బంతులు ఎదుర్కొని 5 బౌండరీలతో 26 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. 23 బంతులు ఎదుర్కొన్న జే రిచర్డ్‌సన్ 1 బౌండరీతో 16 పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో కేదార్ జాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు. పీటర్స్ హ్యాండ్స్‌కాంబ్ 63 బంతులు ఎదుర్కొని 2 బౌండరీలతో 58 పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఆడమ్ జంపా 14 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసి యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో 8 పరుగులు చేసి విజయ్ శంకర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. బిల్లీ స్టాన్‌లేక్ 2 బంతులు ఎదుర్కొని పరుగేమీ చేయకుండానే మహమ్మద్ షమీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 11 బంతులు ఎదుర్కొన్న పీటర్ సిడిల్ 1 బౌండరీతో 10 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ అత్యధికంగా 6 వికెట్లు పడగొట్టాడు. 10 ఓవర్లు వేసిన చాహల్ 42 పరుగులు మాత్రమే ఇచ్చాడు. భువనేశ్వర్ కుమార్ 8 ఓవర్లలో 28, మహమ్మద్ షమీ 9.4 ఓవర్లలో 47 పరుగులిచ్చి తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
అనంతరం 231 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 17 బంతులు ఎదుర్కొని 1 బౌండరీతో 9 పరుగులు చేసి పీటర్ సిడిల్ బౌలింగ్‌లో షాన్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 46 బంతులు ఎదుర్కొని 23 పరుగులు చేసి మార్కస్ స్టోయిన్‌సిస్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. మందకొడి పిచ్‌పై పరుగులు తీయడం కష్టసాధ్యమైనా దానిని సుసాధ్యం చేయడంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కృతకృత్యుడయ్యాడు. 62 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 3 బౌండరీలతో సమయోచితంగా ఆడాడు. 46 పరుగులు చేసి అర్ధసెంచరీకి చేరువలో జే రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో అలెక్స్ కారేకి క్యాచ్ ఇచ్చి కోహ్లీ వెనుతిరిగాడు. వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ 114 బంతులు ఎదుర్కొని 6 బౌండరీలతో 87 పరుగులతో, 57 బంతులు ఎదుర్కొన్న కేదార్ జాదవ్ 7 బౌండరీలతో 61 పరుగులతో అజేయంగా అర్ధ సెంచరీలు పూర్తి చేసుకుని చివరివరకూ నాటౌట్‌గా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో పీటర్ సిడిల్ 9 ఓవర్లలో 56, మార్కస్ స్టోయిన్‌సిస్ 9.2 ఓవర్లలో 60, జే రిచర్డ్‌సన్ 10 ఓవర్లలో 27 పరుగులిచ్చి తలో వికెట్ తీసుకున్నారు.

స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్:

అలెక్స్ కారే సీ విరాట్ కోహ్లీ బీ భువనేశ్వర్ కుమార్ 5,
ఆరోన్ ఫించ్ ఎల్‌బీ భువనేశ్వర్ కుమార్ 14,
ఉస్మాన్ ఖాజా సీ అండ్ బీ యుజువేంద్ర చాహల్ 34,
షాన్ మార్ష్ స్టంప్డ్ మహీంద్ర సింగ్ ధోనీ బీ యుజువేంద్ర చాహల్ 39,
పీటర్ హ్యాండ్స్‌కోమ్ ఎల్‌బీ యుజువేంద్ర చాహల్ 58,
మార్కస్ స్టొయినిస్ సీ రోహిత్ శర్మ బీ మహమ్మద్ షమీ 26,
జే రిచర్డ్‌సన్ సీ కేదార్ జాదవ్ బీ యుజువేంద్ర చాహల్ 16,
ఆడం జంపా 10 నాటౌట్,
బిల్లీ స్టాన్‌లేక్ బీ మహమ్మద్ షమీ 0,
ఎక్‌స్ట్రాలు 10, మొత్తం (48.4 ఓవర్లలో ఆలౌట్) 230.

వికెట్ల పతనం: 1-8, 2-27, 3-100, 4-101, 5-123, 6-161, 7-206, 8-219, 9-228, 10-230.

బౌలింగ్:

భువనేశ్వర్ కుమార్ 8-1-28-2,
మహమ్మద్ షమీ 9.4-0-47-2,
విజయ్ శంకర్ 6-0-23-0,
కేదార్ జాదవ్ 6-0-35-0,
రవీంద్ర జడేజా 9-0-53-0,
యుజువేంద్ర చాహల్ 10-0-42-6.

భారత్ ఇన్నింగ్స్:

రోహిత్ శర్మ సీ షాన్ మార్ష్ బీ పీటర్ సిడిల్ 9,
శిఖర్ ధావన్ సీ అండ్ బీ మార్కస్ స్టొయినిస్ 23,
విరాట్ కోహ్లీ సీ అలెక్స్ కారే బీ జే రిచర్డ్‌సన్ 46,
మహేంద్ర సింగ్ ధోనీ 87 నాటౌట్,
కేదార్ జాదవ్ 61 నాటౌట్,
ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (49.2 ఓవర్లలో 3 వికెట్లకు) 234.

వికెట్ల పతనం: 1-15, 2-59, 3-113.

బౌలింగ్:
జే రిచర్డ్‌సన్ 10-1-27-1,
పీటర్ సిడిల్ 9-1-56-1,
బిల్లీ స్టాన్‌లేక్ 10-0-49-0,
గ్లేన్ మాక్స్‌వెల్ 1-0-7-0,
ఆడం జంపా 10-0-34-0,
మాస్కస్ స్టొయినిస్ 9.2-0-60-1.