క్రీడాభూమి

విండీస్ క్రికెట్ చీఫ్ కోచ్‌గా రిచర్డ్ పైబస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ జాన్స్, జనవరి 19: వెస్టిండీస్ క్రికెట్ నూతన ప్రధాన కోచ్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ పైబస్ ఎంపికపై విమర్శలు చెలరేగుతున్నాయి. రిచర్డ్ పైబస్ 2013 నుంచి 2016 వరకు వెస్టిండీస్ క్రికెట్ టీమ్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్‌లో ఈనెల 23 నుంచి జరిగే టెస్టు సిరీస్‌తోపాటు వరల్డ్ కప్ తర్వాత జూలై, ఆగస్టులో భారత్‌లో వెస్టిండీస్ పలు మ్యాచ్‌లలో ఆడనుంది. ఈ నేపథ్యంలో బోర్డు డైరెక్టర్లలో ఎక్కువ మంది విండీస్ చీఫ్ కోచ్‌గా రిచర్డ్ పైబస్ నియామకం వైపే మొగ్గు చూపడంతో అతని పేరును ఖరారు చేసినట్టు క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) తెలిపింది. రిచర్డ్స్ పైబస్ గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లకు కొంతకాలంపాటు కోచ్‌గా వ్యవహరించాడు. ఇదిలావుండగా, తమ జట్టు ప్రధాన కోచ్‌గా పైబస్‌ను నియమించడం పట్ల క్రికెట్ వెస్టిండీస్ డైరెక్టర్ ఎనోచ్ లూయిస్ వంటివారు తీవ్రంగా విభేదించారు.