క్రీడాభూమి

జొష్ హాజెల్‌వుడ్ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జనవరి 19: శ్రీలంకతో వచ్చే గురువారం నుంచి జరిగే రెండు టెస్టు సిరీస్‌లలో ఆస్ట్రేలియా జట్టు ఫాస్ట్ బౌలర్ జొష్ హాజెల్‌వుడ్ అడే అవకాశం లేదు. వెన్నునొప్పితో బాధపడుతున్న హజల్‌వుడ్ జట్టుకు అత్యంత కీలకమైన ఆటగాడు. అయితే, వెన్నునొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో హజల్‌వుడ్ స్థానంలో జే రిచర్డ్‌సన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే, హజల్‌వుడ్ తప్పనిసరిగా త్వరితగతిన కోలుకుంటాడని, ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగే వరల్డ్ కప్‌తోపాటు వేల్స్‌లో జరిగే మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహిస్తాడనే బలమైన నమ్మకం తనకు ఉందని ఫిజియోథెరపిస్టు డేవిడ్ బీక్‌లే తెలిపాడు. భారత్‌తో ఇటీవల జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లో హజల్‌వుడ్ తన ఆటతీరుతో జట్టు మేనేజిమెంట్‌ను మెప్పించగలిగాడు. గత ఏడాది సైతం ఆసిస్ వైస్‌కెప్టెన్ ఇదే నొప్పి కారణంగా బాధపడుతుండడంతో అతను కొన్ని మ్యాచ్‌లలో ఆడలేకపోయాడు.