క్రీడాభూమి

ఎదురులేని జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జనవరి 25: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్, సెర్బియన్ స్టార్ ఆటగాడు నవోక్ జొకోవిచ్ ఎదురులేకుండా పోతోంది. ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభం నుంచి మంచి జోరు మీద ఉన్న జొకోవిచ్ శుక్రవారం సెమీఫైనల్స్ వరకు అప్రతిహతంగా దూసుకుపోతున్నాడు. కీలకమైన సెమీస్‌లో ప్రపంచ 28వ ర్యాంకర్, ఫ్రెంచ్‌కు చెందిన లుకాస్ పౌల్లేను మట్టికరిపించాడు. ఫైనల్‌లో బెర్త్ కోసం జరిగిన ఈ పోరులో ప్రత్యర్థిపై మొదటి నుంచి జొకోవిచ్‌దే ఆధిపత్యం కొనసాగింది. మూడు సెట్లుగా జరిగిన ఈ మ్యాచ్‌లో 6-0, 6-2, 6-2 తేడాతో ప్రపంచ నెంబర్ వన్ ఘన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ప్రత్యర్థి లుకాస్ ఏ సెట్‌లోనూ గట్టి ప్రతిఘటనను ఇవ్వలేకపోవడంతో జొకోవిచ్‌కు గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. ‘రోడ్ లావెర్ అరెనా మైదానంలో జరిగిన మ్యాచ్ నేను గెలిచిన ఎన్నో గొప్ప మ్యాచ్‌లలో ఒకటి. ఈ మైదానంలో ఆధిపత్యం ఎప్పటికీ నాదే అని భావిస్తా’ అని సెమీఫైనల్స్ మ్యాచ్ అనంతరం జొకోవిచ్ అన్నాడు. ‘సెమీస్‌లో నాతో తలపడిన లుకాస్ సైతం గొప్ప టోర్నమెంట్‌ను ఆడాడు. ఈ సీజన్‌కు ఓటమిని చవిచూసినా భవిష్యత్తులో రాణించాలని అభిలషిస్తున్నాను’ అని అన్నాడు. గత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో కాలునొప్పికి జరిగిన సర్జరీ వల్ల నాలుగో రౌం డ్‌తోనే జొకోవిచ్‌ను వెనుతిరగాల్సి వచ్చింది. అయితే, ఆ తర్వాత కోలుకుని వింబుల్డన్‌లో గెలుపొంది మునుపటి ఫామ్‌ను కనబరుస్తున్నాడు.