క్రీడాభూమి

అమీతుమీకి జొకోవిచ్, నాదల్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 26: చిరకాల ప్రత్యర్థులు నొవాక్ జొకోవిచ్, రాఫెల్ నాదల్ మరోసారి అమీతుమీకి సిద్ధమయ్యారు. ఆదివారం జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల ఫైనల్‌లో వీరిద్దరూ టైటిల్ కోసం తలపడనున్నారు. ప్రపంచ నంబర్ వన్ స్థానంలో ఉన్న జొకోవిచ్ కెరీర్‌లో మొత్తం 14 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు కైవసం చేసుకుంటే, ‘స్పెయిన్ బుల్’గా పేరు పొందిన నాదల్ ఖాతాలో 17 టైటిళ్లు ఉన్నాయి. ఇద్దరూ పోరా యోధులే. ఇద్దరూ సమర్థులే. ఇద్దరూ విజయాల కోసం తుది వరకూ శ్రమించే తత్వం ఉన్నవారే. ఫిట్నెస్ పరంగానే ఇద్దరూ దాదాపు ఒకే స్థాయిలో ఉన్నారు. అయితే, హార్డ్ కోర్ట్, క్లే కోర్టులపై అద్భుతంగా రాణించే నాదల్‌కు గ్రాస్ కోర్టులు అచ్చిరావడం లేదు. అందుకే అతను కేవలం ఒకసారి మాత్రమే ఆస్ట్రేలియా ఓపెన్‌ను గెల్చుకోగలిగాడు. జొకోవిచ్ అందుకు భిన్నంగా గ్రాస్ కోర్టులపై చెలరేగిపోతాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఆరు గెల్చుకోవడమే అతని సామర్థ్యానికి నిదర్శనం. మెల్బోర్న్‌లో వీరిరువు ఆడి మ్యాచ్‌ల గణాంకాలను పరిశీలిస్తే, నాదల్‌పై జొకోవిచ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. అయితే, నాదల్‌కు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు కాబట్టి, ఫలితం ఎటైనా మారవచ్చనేది విశే్లషకుల అభిప్రాయం.