క్రీడాభూమి

విజేత ఒసాకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టైటిల్‌ను జపాన్ క్రీడాకారిణి నవోమీ ఒసాకా కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో ఆమె పెట్రా క్విటోవాను 7-6, 5-7, 6-4 తేడాతో ఓడించింది. ఈ విజయంతో కెరీర్‌లో రెండో గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకోవడంతోపాటు, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను కూడా దక్కించుకుంది. ఈ టోర్నమెంట్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ, ఫైనల్‌కు దూసుకొచ్చిన క్విటోవాకే టైటిల్ దక్కుతుందని అంతా ఊహించారు. 2011, 2014 సంవత్సరాల్లో వింబుల్డన్‌ను సాధించి, రెండు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను అందుకున్న క్విటోవా తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్ చేరడంతో, ఇక్కడ కూడా విజయభేరి మోగిస్తుందని అభిమానులు ఆశించారు. కెరీర్‌లో మూడో గ్రాండ్ శ్లామ్‌ను అందుకుంటుందని అనుకున్నారు. కానీ, తుది పోరులో తీవ్రమైన ఒత్తిడికి గురై, కీలకమైన చివరి సెట్‌ను చేజార్చుకుంది. మొదటి సెట్‌లో కడ వరకూ గట్టిపోటీనిచ్చి, 6-7 తేడాతో కోల్పోయిన క్విటోవా రెండో సెట్‌లో ఎదురుదాడికి దిగింది. ఆ సెట్‌ను 5-7 తేడాతో తన ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నమెంట్ మొత్తంలో మూడు మ్యాచ్‌లను మినహాయిస్తే, మిగతా అన్ని మ్యాచ్‌లనూ మూడు సెట్ల వరకూ ఆడిన ఒసాకా ఫైనల్‌ను ఎలాంటి తడబాటు లేకుండా ముగించింది. తొలి సెట్‌ను అతి కష్టం మీద గెల్చుకున్న ఆమె రెండో సెట్‌ను ప్రత్యర్థికి అప్పగించింది. కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ను గెల్చుకునే అవకాశం ఇద్దరికీ ఉండడంతో, చివరి సెట్‌లో పోరు నువ్వా? నేనా? అన్న చందంగా కొనసాగుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ, అందుకు భిన్నంగా ఒసాకా దాడులకు ఉపక్రమించగా, క్విటోవా పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఆశించిన స్థాయిలో పోటీ లేకపోయినప్పటికీ, చివరి సెట్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఆ సెట్‌ను 6-4 తేడాతో గెల్చుకున్న ఒసాకా ట్రోఫీని అందుకోగా, క్విటోవా రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకుంది.
ప్రయాణం సాగిందిలా..
నవోమీ ఒసాకా: తొలి రౌండ్‌లో మగ్గా లినెట్‌పై విజయం (64-6-2), రెండో రౌండ్‌లో తమరా జిడాన్‌సెక్ (6-2, 6-4), మూడో రౌండ్‌లో సియెన్ సు-వెయ్ (5-7, 6-4, 6-1), నాలుగో రౌండ్‌లో అనస్తాసియా సెవత్సొవా (4-6, 6-3, 6-4)ను ఓడించి, క్వార్టర్ ఫైనల్స్ చేరింది. అక్కడ ఎలినా సొయిటోనాను 6-4, 6-1 ఆధిక్యంతో చిత్తు చేసింది. సెమీ ఫైనల్లో కరోలినా ప్లిస్కోవాపై 6-2, 4-6, 6-4 స్కోరుతో గెలిచి ఫైనల్ చేరింది. అదే తరహా పోరాటాన్ని కొనసాగించి, ఫైనల్లో పెట్రా క్విటోవాపై 7-6, 5-7, 6-4 తేడాతో గెలిచి, కెరీర్‌లో రెండు గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన యూఎస్ ఓపెన్‌లోనూ ఒసాకాకు టైటిల్ లభించింది.
పెట్రా క్విటోవా: తొలి రౌండ్‌లో మగ్దలీన రిబరికొవా (6-3, 6-2), రెండో రౌండ్‌లో ఇరినా కామిల్లా బెగూ (6-1, 6-3), మూడో రౌండ్‌లో బెలిండా బెన్సిక్ (6-1, 6-4), నాలుగో రౌండ్‌లో అమండా అనిసిమోవా (6-2, 6-1)పై విజయాలను నమోదు చేసి క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఆష్లీ బార్టీని 6-1, 6-4 తేడాతో సులభంగా ఓడించి సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. డానియెల్ కొలిన్స్ నుంచి ఎదురైన గట్టిపోటీని తట్టుకొని 7-6 తేడాతో తొలి సెట్‌ను కైవసం చేసుకొని, రెండో సెట్‌ను 6-0 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. ప్రత్యర్థులపై విరుచుకుపడి, సునాయాస విజయాలను నమోదు చేసినప్పటికీ, ఫైనల్లో ఒసాకాను సమర్థంగా ఎదుర్కోలేక, పరాజయంపాలైంది. రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందింది.