క్రీడాభూమి

టీమిండియాతో జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ మాంగనూయ్, జనవరి 27: న్యూజిలాండ్ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో చేసిన ఓ ఫన్నీ పోస్టు వైరల్‌గా మారింది. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఐదు వనే్డ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి రెండు వనే్డలను గెలిచిన విషయం తెలిసిందే. అయతే దీనిపై అక్కడి పోలీసులు ‘న్యూజిలాండ్ పోలీ సులు ప్రజలకు ఒక హెచ్చరిక చేయాలనుకుంటున్నారు. మన దేశానికి పర్యటన నిమిత్తం ఒక ప్రమాదకర జట్టు వచ్చింది. అమాయక న్యూజిలాండ్ జట్టుపై వారు నేపియర్, వౌంట్ మాంగూయ్‌లో దాడి చేశారు. ఎవరైనా బ్యాట్లు, బంతులు తీసుకొని బయటకు వెళ్లాలనుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ ఫన్నీగా చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. అభిమానులు సైతం ఈ పోస్టుపై ఫన్నీగానే కామెంట్లు పెడుతున్నారు.