క్రీడాభూమి

రాయుడు బౌలింగ్‌పై ఐసీసీ నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ, జనవరి 28: భారత ఆటగాడు అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా ఐసీసీ నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో వనే్డ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వనే్డలో రాయుడు ఆఫ్ స్పిన్ బౌలింగ్ యాక్షన్‌పై మ్యాచ్ రిఫరీ ఐసీసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిని ఐసీసీ కూడా తప్పు పట్టింది. ఈ నివేదికను జట్టు మేనేజ్‌మెంట్‌కు అందజేయడంతో పాటు 14 రోజుల్లోగా బౌలింగ్ యాక్షన్ నిరూపించుకోవాలని తేల్చి చెప్పింది. అయతే ఈ పరీక్షకు రాయుడు హాజరు కాకపోవడంతో నిబంధనల మేరకు ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో రాయుడు ఇక బౌలింగ్ చేయరాదని, దేశవాళి, బీసీసీఐ పరిధిలో జరిగే టోర్నీల్లో మాత్రం చేయవచ్చని స్పష్టం చేసింది. అయతే జనవరి 13లోగా రాయుడు బౌలింగ్ యాక్షన్ నిరూపించుకోవాల్సి ఉండగా, న్యూజిలాండ్ పర్యటనతో హాజరు కాలేదు. దీంతో ఐసీసీ 4.2 నిబంధన ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా నిషేధం విధించింది. అయతే రాయుడు పరీక్షకు హాజరై బౌలింగ్ యాక్షన్ నిరూపించుకునే వరకు మాత్రమే ఈ నిషేధం కొనసాగనుంది.