క్రీడాభూమి

భూపతికే మా ఓటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 31: భారత డేవిస్ కప్ జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా మహేష్ భూపతినే కొనసాగించాలని సీనియర్ ఆటగాళ్లు రోహన్ బొపన్న, ప్రజ్ఞేష్ గునే్నశ్వరన్ కోరారు. భూపతికే తమ ఓటు ఉంటుందని, శుక్రవారం నుంచి ఇక్కడ ఇటలీతో ప్రారంభం కానున్న రెండు రోజుల డేవిస్ కప్ క్వాలిఫయింగ్ పోటీల కోసం ఇక్కడికి వచ్చిన వారు విలేఖరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఆనంద్ అమృత్‌రాజ్ స్థానంలో నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న భూపతి కాంట్రాక్టు ముగియనుంది. ఇటలీతో జరిగే క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో భారత్ రాణిస్తేనే భూపతి కాంట్రాక్టును పొడిగించాలని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) భావిస్తున్నట్టు సమాచారం. భూపతిని పూర్తిగా తప్పించాలన్న ఆలోచన కూడా లేకపోలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఏఐటీఏ అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ అన్నారు. ఇలావుంటే, భూపతి కాంట్రాక్టును పునరుద్ధరించాలని, ఆయన మార్గదర్శకంలో యువ ఆటగాళ్లకు చక్కటి మార్గదర్శకం లభిస్తుందని బొపన్న, ప్రజ్ఞేష్ అన్నారు. డేవిస్ కప్‌లో భారత్ రాణించడం అనేది అంతర్జాతీయ వేదిలకపై అపారమైన అనుభవం ఉన్న భూపతి వల్లే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. అతని ఒప్పందాన్ని ఏఐటీఏ కొనసాగిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.