క్రీడాభూమి

బౌల్ట్ ధాటికి భారత్ విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవలం 92 పరుగులకే ఆలౌటైన టీమిండియా తన వనే్డల చరిత్రలో ఏడో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. 2000 సంవత్సరంలో శ్రీలంకతో షార్జాలో జరిగిన వనే్డలో టీమిండియా 54 పరుగులకే కుప్పకూలింది. ఇప్పటి వరకూ భారత్‌కు అదే అత్యల్ప స్కోరు. కాగా, న్యూజిలాండ్‌పై భారత్ ఈ విధంగా తక్కువ స్కోరుకే ఆలౌటైన సంఘనటల్లో ఇది రెండోది. 2010లో దంబుల్లాలో జరిగిన వనే్డ కివీస్‌ను సమర్థంగా ఎదుర్కోలేక 88 పరుగులకే టీమిండియా కుప్పకూలింది. ఈసారి అంతకంటే కొంత మెరుగైన స్కోరుతో తప్పించుకోగలిగింది.
*
హామిల్టన్, డిసెంబర్ 31: పేసర్ ట్రెంట్ బౌల్ట్ పేస్ బౌలింగ్‌కు భారత బ్యాటింగ్ లైనప్ చెల్లాచెదురైంది. టాప్ ఆర్డర్ దారుణంగా విఫలంకావడంతో, న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన నాలుగో వనే్డలో టీమిండియా ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తయింది. లోయర్ ఆర్డర్‌లో యుజువేంద్ర చాహల్ 18 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే, భారత బ్యాటింగ్ ఏ విధంగా పతనమైందో ఊహించుకోవచ్చు. కేవలం 30.5 ఓవర్లు మాత్రమే ఆడగలిగిన టీమిండియా 92 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 21 పరుగుల వద్ద తొలి వికెట్‌ను శిఖర్ ధావన్ రూపంలో కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన అతనిని ట్రెంట్ బౌల్ట్ ఎల్‌బీగా ఔట్ చేశాడు. మరో రెండు పరుగుల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరాడు. ఏడు పరుగులు చేసిన అతను ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లోనే రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంబటి రాయుడు పరుగుల ఖాతా తెరవకుండానే కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో మార్టిన్ గుప్టిల్‌కు క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్‌లోని ఐదో బంతిలో వికెట్‌కీపర్ దినేష్ కార్తీక్ వికెట్ కూడా కూలింది. మూడు బంతులు ఎదుర్కొన్న అతను ఒక్క పరుగు కూడా చేయకుండానే టామ్ లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌కు ఒక ఓవర్‌లోనే రెండు వికెట్లు లభించాయి. కాగా, కెరీర్‌లో తొలి వనే్డ ఆడిన యువ బ్యాట్స్‌మన్ శుభమ్ గిల్ 21 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్ సాయంతో 9 పరుగులు మాత్రమే చేసి, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. హార్డ్ హిట్టర్‌గా పేరు పొందిన కేదార్ జాదవ్ కూడా కివీస్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయాడు. ఏడు బంతుల్లో ఒక పరుగు చేసిన అతనిని ట్రెంట్ బౌల్ట్ ఎల్‌బీగా వెనక్కు పంపాడు. భువనేశ్వర్ కుమార్ 12 బంతుల్లో ఒక పరుగు చేసి కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. చివరిలో హార్దిక్ పాండ్య (15), కుల్దీప్ యాదవ్ (15), యుజువేంద్ర చాహల్ (18 నాటౌట్) కొంత సేపు న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. టీమిండియా 92 పరుగులకే ఆలౌటైంది. ట్రెంట్ బౌల్ట్ 21 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టగా, అతనికి అద్భుత సహకారాన్ని అందించిన కొలిన్ గ్రాండ్‌హోమ్ 26 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు.
భారత్ నిర్దేశించిన 93 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 14 పరుగుల వద్ద మార్టిన్ గుప్టిల్ వికెట్‌ను చేజార్చుకుంది. నాలుగు బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 14 పరుగులు చేసిన అతను హార్దిక్ పాండ్య క్యాచ్ అందుకోగా, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 39 పరుగుల స్కోరువద్ద కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ (11) వికెట్‌ను భువీ తన ఖాతాలో వేసుకున్నాడు. విలియమ్‌సన్ క్యాచ్‌ని వికెట్‌కీపర్ దినేష్ కార్తిక్ అందుకున్నాడు. హెన్రీ నికోల్స్ (42 బంతుల్లో 30), రాస్ టేలర్ (25 బంతుల్లో 37) నాటౌట్‌గా నిలవగా, కివీస్ కేవలం 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే, మొదటి మూడు వనే్డలను టీమిండియా కైవసం చేసుకొని, సిరీస్‌ను సాధించడంతో ఈ పరాజయం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. అయితే, కివీస్‌కు మాత్రం ఇది ఊరటనిచ్చిన విజయం. మళ్లీ ఫామ్‌లోకి రావడంతోపాటు భారత్ ఆధిక్యాన్ని 1-3కు తగ్గించగలిగింది.

చిత్రం..భారత్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీసిన కివీస్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌కు సహచరుల అభినందన