క్రీడాభూమి

డేవిస్ కప్ ఆరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఫిబ్రవరి 1: ప్రతిష్టాత్మక డేవిస్ కప్‌కు ఆతిధ్యమిచ్చిన భారత్‌కు అదృష్టం తొలిరోజు కలసిరాలేదు. శుక్రవారం కోల్‌కతా సౌత్ క్లబ్‌లో ప్రారంభమైన డేవిస్ కప్ క్వాలిఫయర్స్ సింగిల్స్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. రెండు విభాగాల్లో జరిగిన క్వాలిఫయర్స్ సింగిల్స్‌లో ఇటలీ ఆధిపత్యం చెలాయించింది. ఇటలీకి చెందిన టెన్నిస్‌లో అపార అనుభవం కలిగిన ఆండ్రెయాస్ సెప్పి భారత్‌కు చెందిన రామ్‌కుమార్ రామ్‌నాథన్‌పై 6-4, 6-2తో గెలుపు సాధించాడు. అదేవిధంగా తొలిసారిగా డేవిస్ కప్‌లో టోర్నమెంట్‌లో చోటుదక్కించుకున్న ఇటలీకి చెందిన 22 ఏళ్ల యువ ఆటగాడు మట్టెయెవో బెర్రెట్టి భారత నెంబర్ వన్ స్టార్ ఆటగాడు ప్రజ్ఞేష్ గుణ్ణేశ్వరణ్‌ను 6-4, 6-3 తేడాతో ఓడించాడు. డేవిస్ కప్ క్వాలిఫయర్‌లోనే ఇద్దరు భారత ఆటగాడు వెనుకంజ వేయడంతో ఇక ఈ టోర్నమెంట్‌లో శనివారం జరిగే డబుల్స్ విభాగంలో పాల్గొనే రోహన్ బోపన్న, దివిజ్ శరణ్‌పై భారత్ ఆశలు పెట్టుకుంది. సింగిల్స్‌లో జరిగిన రెండు మ్యాచ్‌లలో భారత ఆటగాళ్లు ఓటమి చెందడంతో బోపన్న శరణ్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలావుండగా, ఇటలీకి చెందిన సింగిల్స్‌లో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న ఆటగాడు మార్కో సెచ్చినాటో 2015 ఆస్ట్రేలియా ఓపెన్ విజేత సిమోన్ బోలెల్లీతో కలసి శనివారం భారత జోడీ రోహన్ బోపన్న, దివిజ్ శరణ్‌తో తలపడనున్నారు. ‘డబుల్స్‌లో శనివారం ఎదురయ్యే పోటీ కాస్త కష్టతరమైనది. అయినా పోటీలో ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. మ్యాచ్‌ను జారవిడుచుకునేందుకు మేం సిద్ధంగా లేం’ అని నాన్‌ప్లేయింగ్ కెప్టెన్ మహేష్ భూపతి తొలిరోజు సింగిల్స్ మ్యాచ్ అనంతరం ఇక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నాడు. గత ఏడాది డబుల్స్‌లో ఇలాంటి పరిస్థితులు ఎదురైనపుడు మహేష్ భూపతి స్ఫూర్తితో ఆడిన భారత జోడీ ఆసియా/ఓసియానా గ్రూప్-1లో చైనాపై 3-2 తేడాతో పైచేయి సాధింది. శనివారం కూడా అలాంటి క్లిష్ట పరిస్థితు లు ఎదురయ్యే అవకాశం ఉండడంతో భారత ఆటగాళ్లపై వత్తిడి పెరగవచ్చునని, అయినా చైనాపై ఎదురైన ఫలితం మళ్లీ ఇపుడు పునరావృతం కావొచ్చునని మహేష్ భూపతి అభిప్రాయపడ్డాడు. అయితే, చైనా ఆటగాళ్ల కంటే ఇటలీ ఆటగాళ్లు చాలా బలమైనవారని, అయినా భారత జట్టు గెలుపుపై తమకు అంచనాలు ఉన్నాయని పేర్కొన్నాడు.