క్రీడాభూమి

చివరి వనే్డకు జట్టులో ధనాధన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్‌టన్, ఫిబ్రవరి 2: తొడ కండరాల గాయం కారణంగా మూ డు, నాలుగో వనే్డకు దూరమైన భారత మాజీ కెప్టెన్ మహీంద్రసింగ్ ధోనీ చివరి వనే్డకు జట్టులోకి రానున్నాడు. ఇప్పటికే న్యూజిలాండ్ తో ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను భారత్ 3-1తో సాధించగా, నాలుగో వనే్డలో ఘోర ఓటమిని చవి చూసింది. ఓవైపు రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని దూరమవడంతో మిడిలార్డర్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో చివరి వనే్డకు ధోనీ పూర్తిస్థా య ఫిట్‌నెస్ సాధించినట్లు అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగార్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వనే్డల సిరీస్‌లో 37 ఏళ్ల ధోనీ మూడు అర్ధ సెంచరీలు సాధించిచ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. కివీస్‌తోనూ జరిగిన సిరీస్‌లో ధోనీ రాణించాడు. ఈ సినీయర్ ఆటగాడు జట్టులో ఉంటే మిడిలార్డర్ బలంగా ఉంటుందని విశే్లషకులు భావిస్తున్నారు.