క్రీడాభూమి

శ్రీలంకపై ఆస్ట్రేలియా భారీ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్‌బెర్రా, ఫిబ్రవరి 4: శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ విజృంభించడంతో 366 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. దీంతో రెండు మ్యా చ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశిం చిన 516 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్ నైట్ స్కోరు 17 పరుగులతో సోమవారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన లంక జట్టు 149 పరుగులకే కుప్పకూలింది. నలుగురు బ్యాట్స్‌మెన్లు తప్ప మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గ మనార్హం. 18 పరుగుల వద్ద దిముత్ కరుణరత్నే (8) వికెట్‌ను కోల్పోయన శ్రీలంక, మరో 10 పరుగులకే కెప్టెన్ దినేష్ చండి మల్ (4) వికెట్‌ను మిచెల్ స్టార్క్ పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ లాహిరు తిరుమనే్న (30)తో కలిసి నిరో షాన్ డిక్వెల్లా కొద్దిసేపు ఆసీస్ బౌలర్లను నిలువరించినా, వీరి జోడిని స్టార్క్ విడదీశాడు. జట్టు 58 పరుగుల వద్ద తిరుమనే్నను ప్యాట్ కమ్మిన్స్ అవుట్ చేశాడు. డిక్వెల్లా (27)తో జోడి కట్టిన ఆల్‌రౌండర్ కుషాల్ మెండిస్ వచ్చి రావడంతోనే బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలో డిక్వెల్లాను స్టార్క్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కుషాల్ పెరీరా (0) డకౌట్ కావడంతో 83 పరగులకే సగం వికెట్లు కోల్పోయ శ్రీలంక పీకల్లోతు కష్టా ల్లో పడింది. ఆసీస్ బౌలర్లు ధనుంజయ డిసిల్వా (6), చమిక కరుణరత్నే (22), దిల్‌రువన్ పెరీరా (4), విశ్వ ఫెమండో (0) వెంటవెంటనే పెవిలియన్‌కు పంపడంతో లంక జట్టు 51 ఓవర్ల లోనే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 5, ప్యాట్ కమ్మిన్స్ 3, జే రిచర్డ్‌సన్, మముస్ లబుస్‌చెంజ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
స్కోరు బోర్డు..
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 534/5 డిక్లేర్డ్
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్: 215
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 196/3 డిక్లేర్డ్
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: దిముత్ కరుణరత్నే (బీ) స్టార్క్ 8, లహీరు తిరుమనే్న (సీ) (బీ) ప్యాట్ కమ్మిన్స్ 30, దినేష్ చండిమల్ (సీ) లబుస్‌చెంజ్ (బీ) స్టార్క్ 4, నిరోషన్ డిక్వెల్లా (బీ) స్టార్క్ 27, కుషల్ మెండీస్ (సీ) కర్టీస్ ప్యాటర్‌సన్ (బీ) లబుస్‌చెంజ్ 42, కుషల్ పెరీరా (సీ) పైన్ (బీ) స్టార్క్ 0, ధనుంజయ డిసిల్వా (సీ) మెడ్ (బీ) జే రిచర్డ్‌సన్ 6, చమిక కరుణరత్నే (సీ) పైన్ (బీ) ప్యాట్ కమ్మిన్స్ 22, దిల్‌రువాన్ పెరీరా (సీ) పైన్ (బీ) ప్యాట్ కమ్మిన్స్ 4, కసున్ రజిత (నాటౌట్) 2, విశ్వ ఫెమండో (బీ) స్టార్క్ 0. ఎక్స్‌ట్రాలు: 4 మొత్తం: 149.
వికెట్ల పతనం: 1-18, 2-28, 3-58, 4-83, 5-83, 6-97, 7-143, 8-143, 9-148, 10-149.
బౌలింగ్: మిచెల్ స్టార్క్ 18-2-46-5, జే రిచర్డ్‌సన్ 9-1-29-1, నాథన్ లియాన్ 13-1-51-0, ప్యాట్ కమ్మిన్స్ 8-2-15-3, మముస్ లబుస్‌చెంజ్ 3-1-6-1.