క్రీడాభూమి

ప్రపంచకప్‌కు పాక్ కెప్టెన్‌గా సర్ఫరాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, ఫిబ్రవరి 5: దక్షిణా ఫ్రికా ఆటగాడు ఆండిల్ పెహ్లువాకి యాపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసి నాలుగు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొం టున్న పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, సర్ఫరాజ్ వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేశాయ. వెంటనే తేరుకున్న సర్ఫరాజ్ అహ్మద్ బహిరంగ క్షమాపణలు చెప్పినా, ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) మాత్రం నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించింది. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రపంచకప్‌కు పాక్ సారథిగా సర్ఫరాజ్‌ను కొనసాగిస్తారా లేదా అనే వదంతులు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం తో పాక్ క్రికెట్ బోర్డు స్పందించింది. ప్రపంచకప్‌కు పాక్ సారథిగా సర్ఫరాజ్ అహ్మద్ కొనసాగుతాడని స్పష్టం చేసింది.