క్రీడాభూమి

ఈసారి భారత్‌పై మాదే గెలుపు : మొయిన్‌ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి, ఫిబ్రవరి 13: ఈ ఏడాది ఇంగ్లాం డ్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్ తప్పక విజయం సాధిస్తుందని పాక్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారం రాత్రి జీ న్యూస్‌తో మాట్లాడిన ఈ మాజీ ఆటగాడు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ జట్టును బాగా నడిపిస్తున్నాడని, అందుకు ఇటీవల పాక్ సాధించిన విజయాలే నిదర్శనమని పేర్కొన్నాడు. ఈ ప్రపంచకప్‌లో జూన్ 16న ఓల్ డ ట్రాఫోర్డ్ వేదికగా దాయాది దేశా లు తలపడనున్నాయ. అయతే గత ఆరు ప్రపంచకప్‌లలో ఇరు జట్లు తలపడగా, పా కిస్థాన్‌పై భారత్‌దే పైచేయ ఉండగా, ఈ సారి మాత్రం తమ జట్టు చరిత్రను తిరగ రాస్తుందని మొయన్ పునరుద్ఘటించాడు. రెండేళ్ల క్రితం ఇదే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై పాకిస్థాన్ జట్టు గెలిచిన విషయాన్ని మొయిన్‌ఖాన్ ఈ సందర్భం గా గుర్తు చేశాడు.