క్రీడాభూమి

చివరి టెస్టులో విండీస్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రాస్ ఐలెట్, ఫిబ్రవరి 12: వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లాండ్ 232 పరుగులతో ఘన విజయం సాధించింది. అంతకుముందు 484 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నాలుగో రోజు 252 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బ్యాట్స్‌మెన్లలో రోస్టన్ ఛేజ్ మాత్రమే సెంచరీ చేయగా, అల్జారి జోసెఫ్ (34), కీమర్ రోచ్ (29) చెప్పుకోదగిన స్కోరు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, మొయన్ అలీ చెరో మూడు వికెట్లు తీయగా, బెన్ స్టోక్స్ 2, మార్క్ వుడ్ 1 వికెట్ తీసుకున్నారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జోరూట్ (111), జో డెన్లీ (69), జాస్ బట్లర్ (56) బెన్ స్టోక్స్ (48) పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయ 361 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లోని 123 పరుగుల ఆధిక్యంతో కలిపి విండీస్ 484 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను విండీస్ 2-1తో గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కీమన్ రోచ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 6 వికెట్లు తీసుకున్న మార్క్‌వుడ్‌కు దక్కింది.
సంక్షిప్త స్కోర్‌బోర్డు
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: 277 ఆలౌట్
వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్: 154 ఆలౌట్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 361/5 (డిక్లేర్డ్)
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 252 ఆలౌట్