క్రీడాభూమి

టీనేజర్ శామ్యూల్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, ఫిబ్రవరి 17: ఇథియోపియాకు చెందిన టీనేజర్ 1,500 మీటర్ల ఇండోర్ గ్రాండ్ ప్రిక్స్‌లో సరికొత్త రికార్డును తిరగరాశాడు. శామ్యూల్ టెఫెరా అనే 22 ఏళ్ల యువకుడు ఇక్కడ జరిగిన 1,500 మీటర్ల ఇండోర్ గ్రాండ్ ప్రీలో కేవలం 3 నిమిషాల 31.04 సెకన్లలో లక్ష్యం ఛేదించి సరికొత్త రికార్డును సృష్టించాడు. గతంలో ఇదే విభాగంలో 3 నిమిషాల 31.18 సెకన్లలో మోరాకోకు చెందిన హిచామ్ ఎల్ గురౌజ్ సాధించిన రికార్డును ఇపుడు శామ్యూల్ చెరిపేశాడు. వరల్డ్ రికార్డును సాధించిన సందర్భంగా మాట్లాడుతూ తన విజయాన్ని తాను నమ్మలేకపోతున్నానని, ఏదేమైనా సరికొత్త రికార్డు నెలకొల్పినందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు. గత ఏడాది బర్మింగ్‌హామ్‌లో ఇండోర్ వరల్డ్ టైటిల్ విభాగంలో జరిగిన పోటీలో సైతం శామ్యూల్ విజయం సాధించాడు.