క్రీడాభూమి

ఐదుగురు డకౌట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒమన్, ఫిబ్రవరి 19: ఒకే ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సహా మరో ముగ్గురు డకౌట్..! జట్టు మొత్తం చేసింది 17.1 ఓవర్లలో కేవలం 24 పరుగులు మాత్రమే! అందులో ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చినవి మూడు పరుగులు! మంగళవారం ఒమన్‌లోని ఆల్ ఎమిరేట్ క్రికెట్ మైదానంలో ఓమన్‌తో జరిగిన లిస్ట్ ఏ మ్యాచ్‌లో స్కాట్‌లాండ్ బౌలర్లు చెలరేగారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న స్కాట్‌లాండ్ ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్లను 24 పరుగులకే ఆలౌట్ చేసింది. ఒమన్ జట్టులో ఐదుగురు బ్యాట్స్‌మెన్లు ఖవార్ అలీ (15) మాత్రమే రెండంకెల స్కోరును దాటాడు. ఓపెనర్లు జతీందర్ సింగ్, ట్వింకల్ కుమార్ బండారితో పాటు మూనమ్‌చెరీ మైఖేల్, ఖలీముల్లా, బిలాల్ ఖాన్ పరుగులేమీ చేయకుం డానే పెవిలియన్ చేరారు. జట్టులో మహ్మద్ నదీమ్ (2), అజయ్ లాల్‌చే టా (2), ఖుర్రాం నవాజ్ (1), బదల్ సింగ్ (1) పరుగులు చేశారు. బ్యాట్స్‌మెన్లంతా కలిసి 21 పరుగులు చేయగా, మరో 3 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో వచ్చాయ. స్కాట్ లాండ్ బౌలర్లలో స్మిత్, అద్రియన్ నెయల్ తలో నాలుగు వికెట్లు తీసు కోగా, అలస్‌డైర్ ఇవాన్స్ రెండు వికె ట్లు పడగొట్టాడు. 25 పరుగుల ల క్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన స్కాట్ లాండ్ కేవలం 3.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ నష్టపోకుండా విజయం సా ధించింది. స్కాట్‌లాండ్ బ్యాట్స్‌మెన్ల లో మ్యాథ్యూ క్రాస్ (10), ఖైల్ కోట్జర్ (16) పరుగులు చేశారు.
నాలుగో అత్యల్ప స్కోరు..
లిస్ట్ ఏ క్రికెట్ మ్యాచ్‌లో ఇది నాలుగో అత్యల్ప స్కోరు. 2007లో వెస్టిండీస్ అండర్ -19 జట్టు బార్బ డాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 14.3 ఓవర్లలో 18 పరుగుల ఆలౌటైంది. 2012లో కాల్ట్స్ సీసీ జట్టు సరాకెన్స్ ఎస్‌పీ జట్టుతో తలపడి 19 పరగులకే కుప్పకూలింది. 1974లో యార్క్‌షైర్ జట్టుతో మిడిల్ సెక్స్ జట్టు తలపడి 23 పరుగులకే జట్టు మొత్తం పెవిలియన్‌కు చేరుకుంది.
చిత్రం.. స్కాట్‌లాండ్ ఆటగాళ్ల ఆనందం