క్రీడాభూమి

టీమిండియాపై పాక్ అక్కసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, మార్చి 9: టీమిండియా పాక్ మరోసారి అక్కసు వెల్లగక్కింది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళిగా ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన మూడో వనే్డలో టీమిండియా ఆర్మీ క్యాప్‌లను ధరించి మైదానంలోకి దిగిన విషయం తెలిసిందే. అయతే దీనిని పాకిస్థాన్‌కు చెందిన విదేశాంగ మంత్రి షా మహముద్ ఖురేషీ, సమాచార శాఖ మంత్రి ఫావద్ చౌదరీ, మాజీ కెప్టెన్ ఇంజమమూల్ హాక్‌లు వ్యతిరేకించారు. భారత జట్టు క్రికెట్ రాజకీయం చేయాలని చూస్తోందని, ఇవేవీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. చివరి రెండు వనే్డలకు కూడా భారత్ తీరులో మార్పు రాకుంటే కాశ్మీర్‌లో దురాగతాలకు పాల్పడుతున్న భారత్ తీరుకు నిరసనగా తామూ నలుపు బ్యాండ్‌లు ధరించి ఆడతామని హెచ్చరించారు. అయితే మూడో వనే్డకు ముందు టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న మహేంద్రసింగ్ ధోనీ బీసీసీఐ లోగోలతో కూడిన క్యాప్‌లను సహచరులకు అందించారు.