క్రీడాభూమి

మూడో రౌండ్‌కు గునే్నశ్వరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్, మార్చి 10: భారత యువ ఆటగాడు ప్రజ్నేష్ గునే్నశ్వరన్ ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వెల్స్ పీఎన్‌బీ పరిబాస్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో మూడో రౌండ్ చేరాడు. రెండో రౌండ్‌లో అతను నికొలొజ్ బాసిలాష్విలీని 6-4, 6-7, 7-6 తేడాతో ఓడించాడు. మొదటి సెట్‌లో కష్టపడి గెలిచిన గునే్నశ్వరన్‌కు రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర స్థాయిలో పోటీ ఎదురైంది. ఫలితంగా ఆ సెట్‌ను చేర్చుకోవాల్సి వచ్చింది. అయితే, కీలకమైన చివరి సెట్‌లో గునే్నశ్వరన్ కడవరకూ పోరాడాడు. అతి కష్టం మీద సెట్‌ను తన ఖాతాలో వేసుకొని, మూడో రౌండ్ చేరాడు. కాగా, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ 7-6, 6-2 తేడాతో వరుస సెట్లలో బొర్న్ ఫ్రాకింగెలొటస్‌పై విజయం సాధించి, మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. కాగా, నిక్ కిర్గియోస్‌కు రెండో రౌండ్‌లోనే అనూహ్యంగా ఎదురు దెబ్బ తగిలింది. అతనిని పిలిప్ కొర్చెర్‌బెర్గ్ 6-4, 6-4 ఆధిక్యంతో చిత్తుచేశాడు. గేల్ మోన్ఫిల్స్ 6-4, 3-6, 6-3 స్కోరుతో లెయోనార్డో మార్టిన్ మోయాపై గెలిచాడు. జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తన ప్రత్యర్థి మార్టిన్ క్లిజాన్‌పై మొదటి సెట్‌ను 6-3 తేడాతో నెగ్గాడు. రెండో సెట్‌లో 2-0 ఆధిక్యాన్ని సంపాదించాడు. ఈ దవలో క్లిజాన్ కండరాల నొప్పికారణంగా ఆటను కొనసాగించలేకపోయాడు. ఫలితంగా జ్వెరెవ్ మూడో రౌండ్ చేరాడు.
వీనస్ ముందంజ
మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్ ముందంజ వేసింది. రెండో రౌండ్‌లో ఆమె పెట్రా క్విటోవాను 4-6, 7-5, 6-4 తేడాతో ఓడించింది. మొదటి సెట్‌ను కోల్పోయినప్పటికీ, ఒత్తిడికి గురికాకుండా ఆమె ఆటను కొనసాగించి, మిగతా రెండు సెట్లను తన ఖాతాలోకి వేసుకుంది. మరో మ్యాచ్‌లో నవోమీ ఒసాకా 6-3, 6-4 ఆధిక్యంతో తన ప్రత్యర్థి క్రిస్టినా ‘కికి’ మ్లాడెనొవిచ్‌పై గెలుపొందింది. ఏంజెలిక్ కెర్బర్ 6-0-, 6-2 స్కోరుతో యులీనా పుతిన్‌తీవాపై విజయాన్ని నమోదు చేసి, మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది.

చిత్రాలు.. వీనస్ విలియమ్స్ *ప్రజ్నేష్ గునే్నశ్వరన్