క్రీడాభూమి

ట్రయల్ బౌట్‌కు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: రియో ఒలింపిక్స్‌లో పోటీపడేందుకు వీలుగా నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్ బౌట్‌కు తాను సిద్ధంగా ఉన్నానని స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అన్నాడు. అయితే, రియోకు తనను పంపాలని డిమాండ్ చేయడం లేదని స్పష్టం చేశాడు. పురుషుల 74 కిలోల విభాగంలో భారత్ నుంచి ఒక రెజ్లర్‌కు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్న సుశీల్‌కు అవకాశం ఇస్తారా లేక ఇటీవల కాలంలో పలు అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రతిభ కనబరుస్తూ, మంచి ఫామ్‌లో ఉన్న నర్సింగ్ యాదవ్‌కు అవకాశం దక్కుతుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. లండన్ ఒలింపిక్స్ తర్వాత చాలా పోటీలకు ఎదో ఒక కారణంతో గైర్హాజరవుతున్నాడు. ఫామ్‌లో లేని సుశీల్‌కు బదులు చక్కటి ప్రతిభ కనబరుస్తున్న నర్సింగ్‌ను రియోకు పంపాలన్న డిమాండ్ పెరుగుతున్నది. ఒలింపిక్స్‌కు పంపే అభ్యర్థిని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, నర్సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్న తరుణంలో సుశీల్ పరోక్షంగా సవాలు విసిరాడు. ఒలింపిక్స్ బెర్త్ కోసం తామిద్దరి మధ్య ట్రయల్ బౌట్‌ను నిర్వహించాలని అధికారులకు సూచించాడు. ఎవరు రాణిస్తే వారినే పంపాలని హితవు పలికాడు.
సుశీల్ పేరు తొలగించలేదు: డబ్ల్యుఎఫ్‌ఐ
రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అభ్యర్థులను ఎంపికకు ప్రతిపాదించిన జాబితా నుంచి ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పేరును తొలగించలేదని భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. సుశీల్ పేరును తీసివేశామంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని పేర్కొంది. ప్రాబబుల్స్ జాబితాను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యుడబ్ల్యు) విడుదల చేసిందని పేర్కొంది. డబ్ల్యుఎఫ్‌ఐ నుంచి అలాంటి జాబితా ఏదీ రాలేదని తేల్చిచెప్పింది. ఈ విషయంలో మీడియాలో వస్తున్న కథనాలకు డబ్ల్యుఎఫ్‌ఐ బాధ్యత లేదని తెలిపింది.
మా జోక్యం ఉండదు: కేంద్రం
రియో ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్‌లలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంపై జోక్యం చేసుకునే ప్రసక్తి లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది క్రీడా సమాఖ్యలు, సంఘాలకు సంబంధించిన అంశమని కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. డబ్ల్యుఎఫ్‌ఐ ప్రతిపాదించిన పేరును ఎలాంటి మార్పులు లేకుండా క్రీడా మంత్రిత్వ శాఖ అమోదిస్తుందని అన్నారు.