క్రీడాభూమి

పదవి కోసం కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: తాను ఐసిసి చైర్మన్ పదవి కోసం బిసిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయలేదని శశాంక్ మనోహర్ అన్నాడు. 2014లో ఐసిసి నిబంధనావళిలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ఐసిసికి అధ్యక్షుడితోపాటు కొత్తగా చైర్మన్ పదవి కూడా వచ్చిచేరింది. తొలి చైర్మన్‌గా అప్పటి బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ ఎన్నికయ్యాడు. ఐపిఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలు చోటు చేసుకున్న తర్వాత ఎన్నో మలుపులు తిరిగిన కేసు కారణంగా శ్రీని బిసిసిఐ అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం లభించలేదు. అధ్యక్షుడిగా ఎన్నికైన జగ్మోహన్ దాల్మియా గుండె పోటుతో మృతి చెందిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ స్థానాన్ని మనోహర్ భర్తీ చేశాడు. నిబంధనలను అనసరించి బిసిసిఐ ప్రతిపాదిత అభ్యర్థికే ఐసిసి చైర్మన్‌షిప్ లభించాలి. దీనిని అనుసరించి శ్రీని స్థానం మనోహర్‌కు దక్కింది. కాగా, చైర్మన్ పదవి ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తిగల హోదాగా మారడంతో వచ్చేనెల ఎన్నికకు ఐసిసి రంగాన్ని సిద్ధం చేసింది. మరోసారి చైర్మన్ పదవిని చేపట్టాలన్న ఉద్దేశంతోనే బిసిసిఐ అధ్యక్ష పదవికి మనోహర్ రాజీనామా చేశాడు. నియమావళి ప్రకారం ఒక వ్యక్తి పరస్పర ప్రయోజనాలు ఉండే రెండు హోదాల్లో కొనసాగరాదు. అందుకే, బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి మనోహర్ వైదొలిగాడన్న వాదన వినిపించింది. అయితే, తాను ఐసిసి చైర్మన్ పదవి కోసం రాజీనామా చేయలేదని మనోహర్ స్పష్టం చేశాడు. బిసిసిఐ ఎంత బలమైన క్రికెట్ సంఘమో అందరికీ తెలుసునని, ఆ పదవిని ఎవరూ వద్దనుకోరని వ్యాఖ్యానించాడు. కానీ, తాను ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్నందున, పరస్పర ప్రయోజనాల అవకాశం ఉండరాదన్న ఉద్దేశంతోనే బిసిసిఐ నుంచి వైదొలిగానని అన్నాడు. ఐసిసి చైర్మన్‌గా క్రికెట్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపాడు.