క్రీడాభూమి

పుల్వామా వీర జవాన్ల కుటుంబాలకు సీఎస్‌కే విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 21: పుల్వామా సంఘటనలో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు తమ వంతు సాయం చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) నిర్ణయించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా, హోం గ్రౌండ్‌లో ఆడే మొదటి మ్యాచ్‌లో వచ్చే ఆదాయాన్ని ఆయా కుటుంబాలకు అందచేయాలని నిర్ణయించింది. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన జవాన్ల కుటుంబ సభ్యులకు సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెక్కును అందచేస్తారు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న సీఎస్‌కే శనివారం చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ ద్వారా సమకూరే మొత్తాన్ని ఫిబ్రవరి 14న ఉగ్రవాద దాడిలో మరణించిన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అందచేస్తారు. సీఎస్‌కే డైరెక్టర్ రాకేష్ సింగ్ ఈ విషయాన్ని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్రువీకరించాడు. ఉడుతా భక్తిగా తమ వంతు సాయాన్ని అందిస్తామని ప్రకటించారు.