క్రీడాభూమి

ఆటగాళ్లకేం సంబంధం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: భారత క్రికెట్‌నేగాక, యావత్ ప్రపంచ క్రికెట్ రంగాన్ని కుదిపేసిన స్పాట్, మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంపై భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. ‘రోర్ ఆఫ్ ది లయన్’ (సింహ గర్జన) పేరుతో విడుదలైన ఒక డాక్యుమెంటరీ డ్రామాలో ధోనీ తన అభిప్రాయాలను వెల్లడించాడు. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా చోటు చేసుకున్న ఫిక్సింగ్‌పై అతను ఈ డాక్యుడ్రామాలో మాట్లాడుతూ, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కొన్ని పొరపాట్లు చేసిందని, అయితే, అందులో ఆటగాళ్లకేం సంబంధమని ప్రశ్నించాడు. తన కెరీర్ మొత్తంలో, ఆ సంఘటన కుంగతీసినంతగా తనను మరే ఇతర సంఘటన బాధించలేదని అన్నాడు. 2007 వరల్డ్ కప్‌లో భారత జట్టు గ్రూప్ దశ నుంచే వెనుదిరిగిన విషయాన్ని అతను ప్రస్తావిస్తూ, అప్పుడు తాము సరిగ్గా ఆడలేదని చెప్పాడు. అయితే, 2013 వచ్చేసరికి, ప్రతి ఒక్కరూ, జట్టు మొత్తాన్ని ఫిక్సింగ్ దృష్టితో చూశారని, ఐపీఎల్ ఉదంతమే సర్వత్రా చర్చనీయాంశమైందని చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్సీ వహిస్తూ, మూడు పర్యాయాలు జట్టుకు టైటిల్‌ను అందించిన ధోనీ అన్నాడు. ఫిక్సింగ్ ఆరోపణలు వెలుగు చూసిన తర్వాత, కఠినాతికఠినమైన చర్యలు తప్పవని ముందుగానే ఊహించామని అన్నాడు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్‌ను రెండేళ్లపాటు సస్పెండ్ చేస్తారని అనుకోలేదన్నాడు. ‘మా ఫ్రాంచైజీ కొన్ని పొరపాట్లు చేసింది. నిజమే. కానీ, ఇందులో ఆటగాళ్లుగా మా పాత్ర ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మేము చేసిన పొరపాటు ఏమిటి? ఫిక్సింగ్ సమయంలో నా పేరు కూడా తెరపైకి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తం ఫిక్సింగ్‌లో భాగస్వామిగా మారినట్టు మీడియా, సోషల్ మీడియా హంగామా చేసింది. కానీ, క్రికెట్‌లో ఇది సాధ్యమా?’ అని ప్రశ్నించాడు. ‘స్పాట్ ఫిక్సింగ్ అనేది ఎవరైనా చేయవచ్చు. అంపైర్లు చేయవచ్చు. బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడవచ్చు. కానీ, మ్యాచ్ ఫిక్సింగ్‌కి జట్టులోని ఆటగాళ్లంతా ఒకటి కావాలి. అందరూ అంగీకరించాలి. నా ఉద్దేశంలో ఇంత మంది కలిసి ఒక మ్యాచ్ ఫలితాన్ని నిర్ధారిస్తారనేది అసత్యం. అసాధ్యం’ అన్నాడు. మైదానంలో ఎప్పుడూ వౌనంగా ఉండే ధోనీ, ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వచ్చినప్పుడు కూడా అదే తీరులో వ్యవహరించాడు. దీనితో అతనిపైన కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్‌ను రెండేళ్లపాటు సస్పెండ్ చేయడంతో, ఫిక్సింగ్ కేసులో ఆటగాళ్ల ప్రమేయం లేదని, ఫ్రాంచైజీలోని కొందరు పొరపాట్లు చేశారని స్పష్టమైంది.
చిత్రం.. మహేంద్ర సింగ్ ధోనీ