క్రీడాభూమి

బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకోవడానికి నేను సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకొని, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్నప్పుడు చోటు చేసుకున్న బాల్ ట్యాంపరింగ్ సంఘటనతో సస్పెన్షన్‌ను ఎదుర్కొన్న అప్పటి కెప్టెన్ స్టీవెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మళ్లీ జట్టులోకి రావడం పట్ల ఫించ్ హర్షం వ్యక్తం చేశాడు. వీరి రాక కారణంగా, రాబోయే వరల్డ్ కప్‌లో తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, ఫామ్ కోసం తిప్పలు పడుతున్న ఫించ్ అన్నాడు. ఈ ఏడాది మొత్తం వనే్డ ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన అతను సగటున కేవలం 22.87 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కాగా, అతని బ్యాటింగ్ ఆర్డర్‌ను అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న ఉస్మాన్ ఖాజాకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికితోడు స్మిత్, వార్నర్ కూడా జట్టులోకి రావడంతో, ఆసీస్ బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతమైంది. దీనితో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రతి స్లాట్‌కూ గట్టిపోటీ ఎదురవుతున్నది. ఈ విషయాన్ని ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫించ్ ప్రస్తావిస్తూ, వ్యక్తిగత అంశాల కంటే జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని వ్యాఖ్యానించాడు. ఇటీవల కాలంలో ఖాజాతో కలిసి ఫించ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెడుతున్నాడు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో వీరి మొదటి వికెట్ భాగస్వామ్యంలో 0, 3, 76, 83, 193 చొప్పున పరుగులు లభించాయి. పాకిస్తాన్‌తో షార్జాతో శుక్రవారం నుంచి మొదలయ్యే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లోనూ వీరిద్దరే ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు. అయితే, మళ్లీ జట్టులోకి వచ్చిన స్మిత్, వార్నర్ నుంచి వరల్డ్ కప్ పోటీల్లో ఫించ్‌కు ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంటుందా అనే అనుమానం తలెత్తుతుంది. అందుకే, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసేందుకు తనకు అభ్యంతరం లేదని ఫించ్ స్పష్టం చేశాడు. కానీ, ఐదు లేదా ఆరో స్థానంలో క్రీజ్‌లోకి వస్తే, సెంచరీ చేసే అవకాశం దక్కదని వ్యాఖ్యానించాడు. అంటే, ఫస్ట్ లేదా సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగాలన్నది అతని అభిప్రాయంగా కనిపిస్తున్నది. మొత్తం మీద స్మిత్, వార్నర్ పునరాగమనంతో, ప్రస్తుతం ఆసీస్ జట్టులో ఉన్న చాలా మందిపై ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదు.
చిత్రం.. ఆరోన్ ఫించ్