క్రీడాభూమి

ఈసారి చరిత్ర తిరగరాస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్బడోస్, ఏప్రిల్ 5: వచ్చే నెల నుంచి జరిగే ప్రపంచకప్‌లో ఈసారి చరిత్ర తిరగరాస్తామని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ ధీమా వ్యక్తం చేశా డు. తమ జట్టు చివరిసారిగా 1979లో క్లయవ్ లాయడ్ సారథ్యం లో ప్రపంచకప్‌ను గెలుచుకుందని, 2019 టోర్నీలో తమ జట్టు రాణించి కప్‌ను గెలుస్తుందన్నాడు. చాలా రోజుల సంక్షోభం తర్వాత విండీస్ ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-1తో గెలుచుకొని పదేళ్ల తర్వాత మొదటి టెస్టు విజయాన్ని అందుకుంది. దీంతో పాటు వనే్డ సిరీ స్‌ను 2-2 తేడాతో సమం చేసింది. ప్రస్తుతం జట్టు చాలా బలంగా ఉం దని, తాము తప్పకుండా ప్రపంచకప్ టోర్నీ గెలిచే జట్లలో విండీస్ కూడా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశా డు. అయతే, 2019 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించని విండీస్ క్వాలిఫయంగ్ మ్యాచ్‌లాడి ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.