క్రీడాభూమి

మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో కిదాంబి శ్రీకాంత్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలలాంపూర్, ఏప్రిల్ 5: కౌలలాంపూర్ వేదికగా జరుగుతున్న మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ శ్రీకాంత్ ఇంటిముఖం పట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్‌లో శ్రీకాంత్ 18-21, 19-21 తేడాతో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్, నాలుగో సీడ్ చెన్ లాంగ్ చేతిలో ఓడిపోయాడు. మొదటి గేమ్‌లో 16-11 తేడాతో ఆధిక్యంలో ఉన్న శ్రీకాంత్ ఒత్తిడిని అధిగమించలేకపోయాడు. ఆ తర్వాత పుంజుకున్న చెన్ లాంగ్ తొలి గేమ్‌ను 18-21తో సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో గేమ్‌లో మొదటి నుంచే చెన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. 18-16 తేడాతో వెనుకబడిన శ్రీకాంత్ వెంటనే తేరుకొని వరుస షాట్లతో చెలరేగాడు. 18-18తో సమం చేశాడు. అయతే చివర్లో చెన్ లాంగ్ 19-21తేడాతో రెండో గేమ్‌ను గెలవడంతో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. శ్రీకాంత్ ఓటమితో మలేసియా ఓపెన్‌లో భారత షట్లర్ల కథ ముగిసినట్టయంది.