క్రీడాభూమి

మా బౌలర్లు ఆకట్టుకోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 6: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై బెంగళూరు జట్టు సారథి విరాట్ కోహ్లీ స్పందించారు. బౌలర్ల వైఫల్యం వల్లే గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకున్నామన్నాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లీ నిన్నటి మ్యాచ్ ఫలితాన్ని ఎవ రూ ఊహించి ఉండరన్నారు. ‘చివరి నాలుగు ఓవర్లలో కథ అడ్డం తిరిగింది. మ్యాచ్ గెలవడానికి కీల కంగా భావించే ఆ సమయంలో బౌలర్లు ఆకట్టుకోలేదు. దీన్ని నేను సమర్థించను. మేమింకా తెలివిగా వ్యవరించాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్‌లో మా ప్రదర్శన ఎవరికీ నచ్చ లేదని నాకు తెలుసు’ అని పేర్కొ న్నాడు. కీలక సమయాల్లో ధైర్యంగా బౌలింగ్ చేస్తే ఎలాంటి జట్టుకైనా విజయం తథ్యమని తెలిపాడు. ‘రసెల్ లాంటి పవర్ హిట్టర్లను ఎదు ర్కోవాంటే ఇంతకు మించిన ప్రదర్శ న మాకు అవసరం. మాట్లాడుకో వడంతో ఎలాంటి ప్రయోజనం లే దు. ఈ సీజన్లో మేం నిరుత్సాహరిచే ఉండొచ్చు. కానీ మేం పుంజుకోవడా నికి ఇంకా మాకు అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో మేం మా మీద నమ్మకం కోల్పోకూడదు ’అని తెలిపాడు.