క్రీడాభూమి

ఎందుకు తీసుకోలేదు?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

55 మ్యాచ్‌లు.. 50 ఇన్నింగ్స్‌లు.. 1694 పరుగులు.. మూడు సెంచరీలు.. 10 అర్ధ సెంచరీలు.. 47.05 సగటు ..
79.04 స్రై టక్‌రేట్.. 14 సార్లు నాటౌట్.. ఒక ఆటగాడి ప్రతిభకు ఈ గణాంకాలు సరిపోవా? స్వదేశంలో చివరగా జరిగిన సిరీస్‌లో రాయుడు ఒక్కడే విఫలమయ్యాడా? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో సెలక్షన్ కమిటీని తప్పుబడుతున్నారు. రాయుడుకు జట్టులో చోటు దక్కకపోవడంపై మాజీలతో పాటు పలువురు అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో అంబటి రాయుడు పేరు లేకపోవడంతో క్రికెట్ అభిమానులంతా ఆశ్చర్యపోయారనడంలో ఎలాంటి సందే హం లేదు. గత సీజన్ ఐపీఎల్‌లో రాణించి, తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న రాయుడు గతేడాది కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. భారత జట్టు సాధిం చిన విజయా ల్లో తన వంతు పాత్రను పోషించాడు. కొన్నాళ్లుగా టీమిండియా నెం.4 స్థానాన్ని రాయుడు మాత్రమే భర్తీ చేయగలడు అనేంతలా తన ఆటతీరును మార్చుకున్నాడు. కానీ ప్రపంచకప్ ముందు స్వదేశంలో జరిగిన చివరి వనే్డ సిరీస్‌లో విఫలమ య్యాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లాడిన రాయు డు వరుస గా 13, 18, 2 పరుగులు మాత్రమే చేశాడు. అయతే ప్రపంచకప్ జట్టు సెలక్షన్‌లో భాగంగా ప్రయోగాల పేరిట సెలక్టర్లు చివరి రెండు వనే్డలకు రాయుడుకు అవకాశమివ్వలేదు. దీంతో అంతా కుర్రాళ్లకు అవకాశమివ్వాలనే తప్పించారనుకున్నారు.
అందరూ విఫలమయ్యారు..
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఒక్క రాయుడు కాకుండా చాలామంది ఆటగాళ్లు విఫలమయ్యా రు. అయతే రాయుడు ఆడిన మూడు మ్యాచుల్లో భారత్ రెండింట విజయం సాధించింది. అయతే ఒక్క సిరీస్‌ను పరిగణలోకి తీసుకొని ప్రపంచకప్ జట్టులో రాయుడును తప్పించడంపై మాజీలతో పాటు క్రికెట్ అభిమానులు ఆగ్రహం మండి పడుతున్నారు. దాదాపు 48 సగటుతో రాణిస్తున్న బ్యాట్స్‌మెన్‌ను ఎలా ఎంపిక చేయరంటూ ప్రశ్నిస్తున్నారు. అయతే సెలక్టర్లు మాత్రం రాయుడుకి ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదనే కారణాన్ని తెరమీదకు తేవడం గమనార్హం.
విజయ్ శంకర్‌కు అవకాశం..
అంబటి రాయుడిని కాదని ప్రపంచకప్ జట్టులో తమిళ నాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు సెలక్టర్లు అవకాశం కల్పిం చారు. విజయ్ శంకర్ గత కొద్దిరోజులుగా అటు బ్యాటిం గ్, ఇటు బౌలింగ్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. మరోవైపు బ్యాకప్ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్, బ్యాకప్ వికెట్ కీపర్‌గా దినేష్ కార్తీక్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరితో పాటు మరో ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ను కూడా సెలక్షన్ కమిటీ జట్టులోకి తీసుకుంది.

త్రీడీ కళ్లజోళ్లకు ఆర్డర్..

ప్రపంచకప్ జట్టు ప్రకటించిన తర్వాత అంబటి రాయుడు తొలిసారి స్పందించాడు. ‘ప్రపంచకప్ మ్యాచ్‌లు చూసేందుకు ఇప్పుడే త్రీడీ కళ్లజోళ్ల కొనుగోలుకు ఆర్డర్ చేశా’నంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. చాలామంది అభిమానులు రాయుడులో ఆత్మవిశ్వాసం నింపేలా రీ ట్వీట్ చేశారు.