క్రీడాభూమి

హాలెప్ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 6: ప్రపంచ మూడో ర్యాంకర్ సిమోనా హాలెప్ ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి క్వార్టర్ ఫైనల్స్‌లోనే నిష్క్రమించింది. టైటిల్ ఫేవరిట్స్ జాబితాలో ఉన్న ఆమె మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో 17 ఏళ్ల అమందా అనిసిమోవా చేతిలో ఎవరూ ఊహించని పరాజయాన్ని ఎదుర్కొంది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఆమె, ప్రపంచ మూడో ర్యాంకర్‌ను ఢీకొంటున్నానన్న ఆలోచన లేకుండా మ్యాచ్‌ని కొనసాగించింది. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, 6-2, 6-4 తేడాతో మ్యాచ్‌ని ముగించి సంచలనం సృష్టించింది. ఫస్ట్ సర్వ్‌లో ఆమె విజయాల శాతం 65కాగా, హాలెప్‌ది 53 శాతం మాత్రమే. సర్వీసుల నుంచి ప్లేసింగ్స్ వరకూ అన్ని విభాగాల్లోనూ అనిసిమోవా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. హాలెప్‌ను కోలుకోలేని దెబ్బతీసి, విజయభేరి మోగించి సెమీస్‌కు దూసుకెళ్లింది. కాగా, మరో క్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ మాడిసన్ కీస్‌పై ఎనిమిదో సీడ్ ఆష్లే బార్టీ విజయం సాధించింది. మొదటి సెట్‌ను 6-3 తేడాతో సులభంగానే గెల్చుకున్న బార్టీకి రెండో సెట్‌లో కీస్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయినప్పటికీ, దాడులను కొనసాగించిన బార్టీ ఆ సెట్‌ను 7-5 తేడాతో సొంతం చేసుకొని, సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

చిత్రం... అమందా అనిసిమోవా