క్రీడాభూమి

ఆస్ట్రేలి యా విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రెంట్ బ్రిడ్జి, జూన్ 6: ప్రపంచ కప్ క్రి కెట్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలి యా మరో విజయాన్ని సొంతం చేసు కుంది. అయతే, రెండో విజయం అతి కష్టం మీద లభించింది. 49 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైన ఆ జట్టు అనంత రం వెస్టిండీస్‌ను 50 ఓవర్లలో 9 వికెట్లకు 273 పరుగులకు పరిమితం చేసి, 15 పరుగుల తేడాతో గెలుపొందింది.
టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీనితో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా కేవలం 15 పరుగుల స్కోరువద్ద ఓపెనర్ ఆరోన్ ఫించ్ వికెట్‌ను కోల్పోయింది. 10 బంతులు ఎదుర్కొని, 6 పరుగులు చేసిన అతను ఒషేన్ థామస్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ షాయ్ హోప్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. 8 బంతుల్లో 3 పరుగులు చేసిన అతనిని షిమ్రన్ హాత్‌మేయర్ క్యాచ్ అందుకోగా షెల్డన్ కాట్రెల్ ఔట్ చేశాడు. ఉస్మాన్ ఖాజా 13 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద షాయ్ హోప్ క్యాచ్ పట్టగా, ఆండ్రె రసెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మరో రెండు పరుగుల తర్వాత షెల్డన్ కాంట్రెల్ బౌలింగ్‌లో షాయ్ హోప్ క్యాచ్ అందుకోవడంతో హార్డ్ హిట్టర్ గ్లేన్ మాక్స్‌వెల్ వెనుదిరిగాడు. 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న ఆసీస్‌ను ఆదుకునే బాధ్యతను స్వీకరించిన మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. అయితే, మార్కస్ స్టొయినిస్ 19 పరుగులు చేసి, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో నికొలస్ పూరన్‌కు చిక్కడంతో ఆసీస్ పరిస్థితి మరింత దిగజారింది. 79 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన స్థితిలో మళ్లీ కోలుకోవడం అసాధ్యంగా కనిపించింది. కానీ, స్మిత్‌కు వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ అలెక్స్ కారీ చక్కటి సహకారాన్ని అందించాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో ఆసీస్‌కు, ఆరో వికెట్‌కు 68 పరుగులు లభించాయి. అండ్రె రసెల్ బౌలింగ్‌లో షాయ్ హోప్ క్యాచ్ పట్టి వెనక్కు పంపిన అలెక్స్ కారీ 55 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. అతని స్కోరులో 7 ఫోర్లు ఉన్నాయి. ఆరో డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన నాథన్ కౌల్టర్ నైల్ సహకారంతో స్మిత్ స్కోరు బోర్డును ముందుకు దూకించాడు. ఏడో వికెట్‌కు 102 పరుగులు జత కలిసిన తర్వాత స్మిత్ పోరాటం ముగిసింది. 103 బంతులు ఎదుర్కొని, 7 ఫోర్లతో 73 పరుగులు చేసిన అతను షెల్డన్ కాట్రెల్ క్యాచ్ పట్టగా, ఒషేన్ థామస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. పాక్ కమిన్స్ రెండు పరుగులు చేసి, కార్లొస్ బ్రాత్‌వెయిట్ బౌలింగ్‌లో షెల్డన్ కాంట్రెల్‌కు దొరికాడు. తన అద్భుత పోరాట పటిమతో ఆసీస్‌ను ఆదుకొని, 60 బంతుల్లో 92 పరుగులుచేసిన నాథన్ కౌల్టర్ నైల్ సెంచరీ పూర్తి చేయకుండానే కార్లొస్ బ్రాత్‌వెయిట్ బౌలింగ్‌లో జాసన్ హోల్డన్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. అతను 8 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. అదే ఓవర్‌లో మిచెల్ స్టార్క్ (8) వికెట్‌ను కూడా కార్లొస్ బ్రాత్‌వెయిట్ సాధించడంతో, ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు 49 ఓవర్లలో 288 పరుగుల వద్ద తెరపడింది. విండీస్ బౌలర్లలో కార్లొస్ బ్రాత్‌వెయిట్ 67 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా, ఒషేన్ థామస్, షెల్డన్ కాంట్రెల్, ఆండ్రె రసెల్ తలా రెండేసి వికెట్లు సాధించారు. జాసన్ హోల్డర్‌కు ఒక వికెట్ లభించింది.
నిరాశపరచిన గేల్
హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ అభిమానులను నిరాశపరిచాడు. 289 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఇన్నింగ్స్‌ను అతను ఎవిన్ లూయిస్‌తో కలిసి ప్రారంభించాడు. జట్టు స్కోరు ఏడు పరుగుల వద్ద, పాట్ కమిన్స్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి లూయిస్ ఔటయ్యాడు. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతాడనుకున్న గేల్ 21 పరుగులు చేసి, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్‌బీగా వెనుదిరిగాడు. అతని స్కోరులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. వేగంగా స్కోరును పెంచేందుకు ప్రయత్నించే క్రమంలో 36 బంతుల్లో 40 పరుగులు చేసిన నికొలస్ పూరన్‌ను ఆరోన్ ఫించ్ క్యాచ్ పట్టడంతో, ఆడం జంపా ఔట్ చేశాడు. షాయ్ హోప్, షిమ్రన్ హాత్‌మేయర్ భాగస్వామ్యం బలపడుతున్నట్టు కనిపించింది. కానీ, 21 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద హాత్‌మేయర్ దురదృష్ట వశాత్తు రనౌటయ్యాడు. 149 పరుగుల వద్ద విండీస్ నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. మరోవైపు షాయ్ హోప్ 76 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. వరల్డ్ కప్‌లో అతనికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. మరికొంత సేపు అదే పోరాటాన్ని కొనసాగించిన అతను 68 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద, పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖాజాకు క్యాచ్ అందించి వెనుదిరిగాడు. 190 పరుగుల వద్ద విండీస్ ఐదో వికెట్ చేజార్చుకుంది. కెప్టెన్ జాసన్ హోల్డర్‌తో జత కలిసిన ఆండ్రె రసెల్ ఇన్నింగ్స్ 38 ఓవర్‌లో జట్టు స్కోరును 200 పరుగుల మైలురాయిని దాటించాడు. ఆడం జంపా వేసిన ఆ ఓవర్ రెండో బంతిని అతను సిక్సర్‌గా మలచాడు. కానీ, ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయిన అతను 15 పరుగులు చేసి, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో గ్లేన్ మాక్స్‌వెల్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. కాగా, హోల్డర్ 50 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసి, జట్టు ఆశలకు ఊపిరిపోశాడు. మరోవైపు బ్రాత్‌వెయట్ 16 పరుగులు చేసి, ఆరోన్ ఫించ్ క్యాచ్ పట్టగా మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అదే ఓవర్‌లో హోల్డర్ (51) కూడా పెవిలియన్ చేరాడు. రెండు వరుస వికెట్లు విండీస్‌ను దెబ్బతీశాయ. షెల్డన్ కాంట్రెల్ ఒక పరుగు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. చివరి ఓవర్‌లో నాలుగు ఫోర్లు బాదిన ఆష్లే నర్స్ 19, ఒషేన్ థామస్ పరుగుల ఖాతా తెరవకుం డా క్రీజ్‌లో ఉండగా, 50 ఓవర్లు ముగిసే సమయానికి విండీస్ 9 వికెట్లకు 273 పరుగులు చేసింది.

స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్ సీ హాత్‌మేయర్ బీ కాంట్రెల్ 3, అరోన్ ఫించ్ సీ షాయ్ హోప్ బీ ఒషేన్ థామస్ 6, ఉస్మాన్ ఖాజా సీ షాయ్ హోప్ బీ ఆండ్రె రసెల్ 13, స్టీవ్ స్మిత్ సీ కాంట్రెల్ బీ ఒషేన్ థామస్ 73, గ్లేన్ మాక్స్‌వెల్ సీ షాయ్ హోప్ బీ కాంట్రెల్ 0, మార్కస్ స్టొయినిస్ సీ పూరన్ బీ హోల్డర్ 19, అలెక్స్ కారీ సీ షాయ్ హోప్ బీ ఆండ్రె రసెల్ 45, నాథన్ కౌల్టర్ నైల్ సీ హోల్డర్ బీ బ్రాత్‌వెయిట్ 92, పాట్ కమిన్స్ సీ కాంట్రెల్ బీ బ్రాత్‌వెయిట్ 2, మిచెల్ స్టార్క్ సీ హోల్డర్ బీ బ్రాత్‌వెయిట్ 8, ఆడం జంపా 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 27, మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్) 288.
వికెట్ల పతనం: 1-15, 2-26, 3-36, 4-38, 5-79, 6-147, 7-249, 8-268, 9-284, 10-288.
బౌలింగ్: ఒషేన్ థామస్ 10-0-63-2, షెల్డన్ కాంట్రెల్ 9-0-56-2, ఆండ్రె రసెల్ 8-0-41-2, కార్లొస్ బ్రాత్‌వెయిట్ 10-0-67-3, జాసన్ హోల్డర్ 7-2-28-1, ఆష్లే నర్స్ 5-0-31-0.
వెస్టిండీస్: క్రిస్ గేల్ ఎల్‌బీ మిచెల్ స్టార్క్ 21, ఎవిన్ లూయిస్ సీ స్టీవ్ స్మిత్ బీ పాట్ కమిన్స్ 1, షాయ్ హోప్ సీ ఉస్మాన్ ఖాజా బీ పాట్ కమిన్స్ 68, నికొలస్ పూరన్ సీ ఆరోన్ ఫించ్ బీ ఆడం జంపా 40, షిమ్రన్ హాత్‌మేయర్ రనౌట్ 21, జాసన్ హోల్డర్ సీ ఆడం జంపా బీ మిచెల్ స్టార్క్ 51, ఆండ్రె రసెల్ సీ గ్లేన్ మాక్స్‌వెల్ బీ మిచెల్ స్టార్క్ 15, కార్లొస్ బ్రాత్‌వెయిట్ సీ ఆరోన్ ఫించ్ 16, ఆష్లే నర్స్ 19 నాటౌట్, షెల్డన్ కాంట్రెల్ బీ మిచెల్ స్టార్క్ 1, ఒషేన్ థామస్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 20, మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 273.
వికెట్ల పతనం: 1-7, 2-31, 3-99, 4-149, 5-190, 6-216, 7-252, 8-252, 9-256, 10-
బౌలింగ్: మిచెల్ స్టార్క్ 10-1-46-2, పాట్ కమిన్స్ 10-3-41-2, నాథన్ కౌల్టర్ నైల్ 10-0-70-0, గ్లేన్ మాక్స్‌వెల్ 6-1-31-0, ఆడం జంపా 10-0-58-1, మార్కస్ స్టొయనిస్ 4-0-18-0.

చిత్రం...క్రిస్ గేల్ ఔటైనప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆనందం