క్రీడాభూమి

జెన్డానా సూపర్ డబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, జూన్ 7: ఆసియా క్రీడల చాంపియన్ జపాన్ ఇక్కడ జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ హాకీ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. హిరొటకా జెన్డానా రెండు గోల్స్ చేసి, మెక్సికోతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో జపాన్ 3-1 తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి కెరీర్‌లో ఇది వందో అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. మ్యాచ్ మూడో నిమిషంలోనే ఎరిక్ హెర్నాండెజ్ గోల్ చేసి, మెక్సికోకు ఆధిక్యాన్ని అందించాడు. అయితే, కొన్ని సెకన్ల తేడాతో జెన్డానా తన జట్టుకు ఈక్వెలైజర్‌ను సాధించిపెట్టాడు. ఆతర్వాత జపాన్ దూకుడును కొనసాగించి, మెక్సికోను పూర్తి ఆత్మరక్షణలో పడేసింది. 21వ నిమిషంలో షొతా యమదా తనకు లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. 34వ నిమిషంలో జెన్డానా తన రెండో గోల్‌ను సాధించాడు. ఆతర్వాత మరో గోల్ నమోదు కాలేదు. దీనితో, జపాన్ 3-1 తేడాతో గెలిచింది.