క్రీడాభూమి

రికార్డుల వనే్డ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటింహామ్, జూన్ 7: వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ గ్రూప్ మ్యాచ్‌లో రెండు రికార్డులు నమోదయ్యాయి. వనే్డ ఇంటర్నేషనల్స్ చరిత్రలో అత్యంత వేగంగా 150 వికెట్ల మైలురాయిని చేరిన బౌలర్‌గా ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు నెలకొల్పాడు. అతను 76 వనే్డల్లో ఈ ఫీట్‌ను సాధించి, ఇంతకు ముందు 77 వనే్డలతో అగ్రస్థానంలో ఉన్న పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్‌ను రెండో స్థానానికి నెట్టాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 81 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు పూర్తి చేసి మూడో స్థానంలో ఉన్నాడు. నాలుగు ఐదు స్థానాలువరుసగా బ్రెట్ లీ (ఆస్ట్రేలియా/ 82 మ్యాచ్‌లు), అజంతా మేండిస్ (శ్రీలంక/ 84 మ్యాచ్‌లు)కు లభించాయి. కాగా, ప్రపంచ కప్ టోర్నీలో రెండు పర్యాయాలు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు కూల్చిన బౌలర్ల సరసన స్టార్క్ చోటు సంపాదించాడు. ఇంతకు ముందు గారీ గిల్మోర్ (ఆస్ట్రేలియా), అశాంత డి మెల్ (శ్రీలంక), గ్లేన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా), వస్బర్ట్ డ్రేక్స్ (వెస్టిండీస్), షాహిద్ అఫ్రిదీ (పాకిస్తాన్) వరల్డ్ కప్‌లో రెండు పర్యాయాలు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టారు. తాజాగా మిచెల్ ఈ జాబితాలో చేరాడు. వెస్టిండీస్‌తో స్టార్క్ ఇంత వరకూ 7 వనే్డలు ఆడి, 21 వికెట్లు పడగొట్టాడు. 20 పరుగులకు ఐదు వికెట్లు విండీస్‌పై అతని అత్యుత్తమ ప్రదర్శన. మూడు పర్యాయాలు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించాడు.
ఇలావుంటే, వరల్డ్ కప్ టోర్నీలో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ నాథన్ కౌల్టర్ నైల్ రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో అతను 60 బంతులు ఎదుర్కొని, 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. వరల్డ్ కప్‌లో ఎనిమిదో స్థానానికి ఇదే అత్యధిక స్కోరు. వనే్డ ఇంటర్నేషనల్స్ కెరీర్‌లో కౌల్టన్ నైల్ అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శన ఇదే కావడం విశేషం. అతని బ్యాటింగ్ ప్రతిభే విండీస్‌పై ఆస్ట్రేలియాకు 15 పరుగుల తేడాతో విజయాన్ని అందించింది.

ఆస్ట్రేలియా అదృష్టం!
నాటింహామ్, జూన్ 7: మొదట్లోనే వికెట్లు చేజార్చుకున్న ఏ జట్టయినా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. ఆతర్వాత మ్యాచ్‌ని కోల్పోతుంది. కానీ, ఆస్ట్రేలియాను మాత్రం త్వరత్వరగా వికెట్లు కూలిన ఐదు సందర్భాల్లో విజయం వరించింది. తక్కువ పరుగులకే మొదటి నాలుగు వికెట్లను పోగొట్టుకున్న ఐదు సందర్భాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. 1996లో, వెస్టిండీస్‌తో మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 15 పరుగులకే నాలుగు వికెట్లు నష్టపోయింది. కానీ, చివరిలో ఆ మ్యాచ్‌ని గెల్చుకుంది. అదే విధంగా 1975లో, ఇంగ్లాండ్‌తో లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగులకు నాలుగు, తాజాగా వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 38 పరుగులకు నాలుగు చొప్పున వికెట్లు సమర్పించుకుంది. కానీ, ఈ రెండు మ్యాచ్‌లనూ తన ఖాతాలో వేసుకుంది. అదే విధంగా 2003లో న్యూజిలాండ్‌తో పోర్ట్ ఎలిజబెత్‌లో 47 పరుగులకు నాలుగు, అదే ఏడాది, అదే వేదికపై ఇంగ్లాండ్‌ను ఢీకొన్నప్పుడు 48 పరుగులకు నాలుగు చొప్పున వికెట్లను సమర్పించుకుంది. ఆ మ్యాచ్‌ల్లోనూ ఆసీస్‌ను విజయం వరించడం విశేషం. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం ఆసీస్‌కు అదృష్టాన్ని తీసుకొస్తున్నదేమో!