క్రీడాభూమి

ధోనీ తప్పేం లేదు బాసటగా నిలిచిన బీసీసీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: భారత మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ సమయంలో వేసుకున్న గ్లోవ్స్‌పై దేశం కోసం భారత సైనికుల బలిదానాలకు చిహ్నంగా డాగర్ (కత్తి) లోగో ఉండడాన్ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సమర్థించింది. ఇందులో అతని తప్పేం లేదని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అతని గ్లోవ్స్‌పై డాగర్ చిహ్నాన్ని తొలగించేది లేదని స్పష్టం చేసింది. నిజానికి గ్లోవ్స్‌వై ఉన్న చిహ్నం గురించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఇది వరకే తెలియచేశామని బీసీసీఐ పాలనాధికారుల బృందం (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ తెలిపాడు. నిజానికి గ్లోవ్స్‌పై చిహ్నాలు ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. అయితే, పుల్వామా దాడిలో సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతిని సూచించే రీతిలో ధోనీ డాగర్ చిహ్నం ఉన్న గ్లోవ్స్‌ను ధరించి ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్నాడు. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను వేసుకున్న గ్లోవ్స్‌పై భారత సైన్యాన్ని సూచిస్తున్న విధంగా చిహ్నం కనిపించడం వివాదానికి దారి తీసింది. ఇలాంటి చర్యలను సమర్థించరాదని పలువురు ధ్వజమెత్తారు. అయితే, ధోనీని బీసీసీఐ బాసటగా నిలిచింది. అతని తప్పు ఏమీ లేదని తేల్చిచెప్పింది. ఐసీసీకి ఇది వరకే సమాచారం అందించామని, అక్కడి నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు కాబట్టే, అతను డాగర్ చిహ్నం ఉన్న గ్లోవ్స్ వేసుకున్నాడని వినోద్ రాయ్ వివరించాడు. అతనిపై వచ్చిన విమర్శల్లో పస లేదని వ్యాఖ్యానించాడు. ఇలావుంటే, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ సహచరుకు సురేష్ రైనా, మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకున్న రెజ్లర్ యోగేశ్వర్ దత్, స్ప్రింటర్ హిమా దాస్ తదితరులు కూడా ధోనీకి మద్దతు పలికారు. వీర జవాన్లను గుర్తుచేసుకోవడం, వారికి నివాళులర్పించడం ఏ విధంగా తప్పవుతుందని నిలదీశారు. ధోనీ చర్య దేశభక్తిని నిదర్శనమని అన్నారు. భారత సైన్యంలో ధోనీకి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉన్న విషయం తెలిసిందే.