క్రీడాభూమి

బహుపరాక్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్ మైదానంలోగానీ.. నెట్ ప్రాక్టీస్‌లోగానీ.. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు తప్పవని రుజువు చేస్తున్న చిత్రాలివి. బంగ్లాదేశ్‌తో కార్డ్ఫిలోని సోఫియా గార్డెన్స్‌లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జాసన్ రాయ్ సెంచరీని పూర్తి చేసే క్రమంలో వేగంగా పరుగెడుతూ పొరపాటున అంపై ర్ జోల్ విల్సన్‌ను ఢీకొన్నాడు. ఈ సంఘటనలో విల్సన్ కిందపడిపోయాడు. కాగా, కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో శనివారం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కొట్టిన బంతి ఓ నెట్ బౌలర్ తలకు తగిలింది. అతను గాయపడడాన్ని గమనించిన వార్నర్ వెంటనే వైద్య సిబ్బందిని రావాల్సిందిగా కోరాడు. ఈ రెండు సంఘటనలు కూడా క్రికెట్ ఆడుతున్నప్పుడు లేదా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.