క్రీడాభూమి

సిక్సర్ల యువరాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: యువరాజ్ సింగ్.. క్రికెట్ అభిమానులు ఈ పేరు వింటే చాలు సిక్సర్ల ముచ్చట్లలో మునిగిపోతారు! గెలుపు ఇక అసాధ్యమే అనుకున్న మ్యాచ్‌లనూ ఒంటి చేతితో గెలిపించి చూపించాడు! ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ వనే్డల్లో యువరాజ్ రాకముందు.. వచ్చిన తర్వాత అని చెప్పొచ్చు! ఫార్మాట్ ఏదైనా తనదైన శైలిలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం అతడికి మాత్రమే తెలుసు! 1986 తర్వాత ఎప్పటి నుంచో కలగానే ఉన్న ప్రపంచకప్‌ను 2011లో భారత్ సాధించడం వెనుక క్రికెట్ మహారాజ్ కృషి ఎంతో ఉంది! కఠిన పరిస్థితుల్లోనూ ఒంటి చేత్తో జట్టుకు ఎన్నో చిరస్మరణ విజయాలను అందించాడు! కెరీర్ మధ్యలోనే ప్రాణాంతకమైన క్యాన్సర్ వెంటాడినా, ధైర్యంగా ఎదుర్కొని తిరిగి జట్టులో చోటు సంపాదించడం యువీకి మాత్రమే సాధ్యమైంది!
యువరాజ్ సింగ్ 1981 డిసెంబర్ 12న చండీగర్‌లో జన్మించాడు. అతడి తండ్రి యోగారాజ్ సింగ్ కూడా భారత మాజీ క్రికెటరే. 1996 అండర్-16, 2000 అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు అందుకుని సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో అదే సంవత్సరం అక్టోబర్‌లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వనే్డ క్రికెట్‌లో అడుగు పెట్టాడు. అనతికాలంలోనే భారత జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా మారాడు. అంతేకాకుండా జట్టు అవసరాల కోసం బౌలర్ అవతారం కూడా ఎత్తాడు. ఇక ఫీల్డింగ్‌లో ఎన్నో కళ్లు చెదిరె క్యాచ్‌లను అందుకున్నాడు. 19 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 304 అంతర్జాతీయ వనే్డలను ఆడిన యువరాజ్ సింగ్ 8701 పరగులు చేశాడు. ఇందు లో 14 సెంచరీలు, 52 అర్ధ సెంచరీలుండడం విశేషం. 38.68 యావరేజ్‌తో 111 వికెట్లను పడగొట్టాడు. 2011 ప్రపంచకప్‌లో బెంగళూరు వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి ఉత్తమ గణాంకాలను నమోదు చేశాడు. 2003లో న్యూజిలాండ్ జట్టుపై టెస్ట్ ఆరంగేట్రం చేసిన యువీ మొత్తం 40 టెస్టు మ్యాచులాడాడు. ఇందులో 1900 పరుగులు చేయడంతో పాటు మూడు సెంచరీలు, 11 అర్ధ సెంచరీలను సాధించాడు. బౌలింగ్‌లో తొమ్మిది వికెట్లు తీశాడు. ఇక పొట్టి ఫార్మట్ క్రికెట్‌లో 58 మ్యాచుల్లో 1177 పరుగులు చేశాడు. ఇందులో 8 అర్ధ సెంచరీలను నమోదు చేయడంతో పాటు 28 వికెట్లను పడగొట్టాడు.
క్యాన్సర్‌తో పోరాటం
2011 ప్రపంచకప్ సమయంలో యువరాజ్ సింగ్ ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడ్డాడు. దీంతో ఇంగ్లాండ్‌లో ప్రత్యేకమైన చికిత్స తీసుకొని క్యాన్సర్‌ను జయంచాడు. ఆ తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకొని తిరిగి జాతీయ జట్టులో చోటు కోసం అహర్నషలు శ్రమించాడు. కొన్ని మ్యాచుల్లో జట్టుకు ఎంపికైనా మునపటి ప్రదర్శన కనబర్చకపోయాడు. మరోవైపు యువ ఆటటగాళ్ల నుంచి పోటీ ఎదురుకావడం కూడా జట్టులో యువీ స్థానం కోల్పోయేలా చేశాయ. ఇటీవలి కాలంలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో ముంబై ఇండియన్స్ జట్టుకు చివరి క్షణంలో ఎంపికైనా ఆడినవి కొన్ని మ్యాచులే. అందులోనూ పెద దగా రాణించలేకపో యాడు. 2019 ప్రపంచకప్ ఆడతానని ఎప్పుడూ చెప్పే యువీ ఫాం కారణంగా జట్టుకు ఎంపిక కాలేకపోయాడు. దీంతో 2017లో వెస్టిండీస్‌తో ఆడిన వనే్డ మ్యాచే చివరిదైంది. టెస్టుల్లో చివరగా 2012లో ఇంగ్లాండ్‌తో ఆడగా, టీ20లో స్కాట్‌లాండ్‌తో 2017లో ఆడాడు.
ప్రపంచకప్‌లో అన్ని టోర్నమెంట్లో సచిన్ తర్వాత అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న క్రికెటర్‌గా యువరాజ్ నిలిచాడు.
ఇప్పటివరకు వనే్డల్లో 26 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోగా, అందులో రెండు మ్యాచుల్లో తప్ప అన్ని మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది.
పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో అతి తక్కువ బంతుల్లో (12) అర్ధ శతకం సాధించిన క్రికెటర్‌గా యువరాజ్ రికార్డు సాధించాడు. ఇప్పటికీ ఈ రికార్డు యువీ పేరిటే ఉంది.
2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు.
భారత ప్రభుత్వం 2012లో అర్జున, 2014లో పద్మశ్రీ పురస్కారలతో యువరాజ్‌ని సత్కరించింది.

చిత్రాలు.. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన అన ంతం
సహచర ఆటగాళ్లతో యువరాజ్ సింగ్
*2007: టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ కొట్టిన ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు

*2011 ప్రపంచకప్‌లో
మ్యాన్ ఆఫ్ ది సిరీస్ తీసుకుంటూ..
*2011 ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో యువీ
*క్యాన్సర్‌తో ఆస్పత్రిలో పోరాడుతూ..