క్రీడాభూమి

స్మిత్‌కు అభిమానుల తరఫున కోహ్లీ సారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 10: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత అభిమానుల తరఫున ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవెన్ స్మిత్‌కు క్షమాపణలు చెప్పాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను భారత అభిమానులు చీటర్ అంటూ గేలి చేశారు. దీనిని గమనించిన కోహ్లీ, హార్దిక్ పాండ్య అవుటైన తర్వాత ప్రేక్షకులను ఉద్దేశించి అలా ప్రవర్తించవద్దంటూ మందలించడంతో పాటు భారత ప్రేక్షకుల తరఫున తానే స్వయంగా స్మిత్‌కు క్షమాపణలు చెప్పినట్లు మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ వెల్లడించారు.