క్రీడాభూమి

విండీస్, దక్షిణాఫ్రికా వనే్డ వర్షార్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్, జూన్ 10: వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయంది. అంతకుముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీలకు విండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ షాక్ ఇచ్చాడు. కాట్రెల్ వేసిన మూడో ఓవర్‌లో ఓపెనర్ హషీమ్ అమ్లా (6) క్రిస్‌గేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అల్డెన్ మార్క్రమ్ (5)ను సైతం కాట్రెల్ పెవిలియన్‌కు పంపడంతో దక్షిణాఫ్రికా 28 పరుగులకే 2 వికెట్లను కోల్పోయ కష్టాల్లో పడింది. అయతే మరో ఓపెనర్ క్వింటన్ డీకాక్ (17, నాటౌట్), కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ (0, నాటౌట్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే క్రమంలో 8వ ఓవర్ వద్ద వర్షంతో రెండు సార్లు అంతరాయం కలగడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత ఆట ఏమాత్రం సాధ్యపడకపోవడంతో భారత కాలమాన ప్రకారం రాత్రి 8.50 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ఆంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
పాయంట్ల పట్టికలో సఫారీల బోణీ
విండీస్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం కావడంతో దక్షిణాఫ్రికా జట్టుకు 1 పాయింట్ లభించింది. దీంతో ఆడిన మూడు వనే్డల్లో ఓడిన సఫారీ జట్టు వర్షం కారణంగా పాయంట్ల పట్టికలో బోణీ చేసినట్లయింది. అంతకుముందు ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, భారత్ లతో ఆడిన మూడు మ్యాచుల్లోనూ దక్షిణాఫ్రికా పరాజయం పొందిన విషయం తెలిసిందే.