క్రీడాభూమి

కోలుకుంటున్న జై కిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 11: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ నెట్ ప్రాక్టీస్‌లో కొట్టిన బంతి తలకు తగలడంతో గాయపడిన భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఫాస్ట్ బౌలర్ జై కిషన్ ప్లాహ కోలుకుంటున్నాడు. అతను నడుస్తున్నాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నెట్స్‌లో జై కిషన్ గాయపడిన వెంటనే, అతనికి సత్వర సేవలు అందించాల్సిందిగా వార్నర్ స్వయంగా సపోర్టింగ్ స్ట్ఫాను పిలిచాడు. వారు వచ్చి, ప్రాథమిక చికిత్స అందించే వరకూ అతని పక్కనే కూర్చున్నాడు. ఆతర్వాత నెట్ ప్రాక్టీస్‌ను కొనసాగించలేదు. 2014 నవంబర్ 25న షీఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో భాగంగా మ్యాచ్ ఆడుతున్నప్పుడు పేసర్ సీన్ అబోట్ వేసిన బౌన్సర్ తలకు తగలడంతో తీవ్రంగా గాయపడిన యువ బ్యాట్స్‌మన్ ఫిల్ హ్యూస్ ఆతర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటి నుంచి ఆసీస్ క్రికెటర్లంతా ఎవరి తలకైనా గాయమైతే వణికిపోతున్నారు. ఆ సంఘటన గుర్తుకొచ్చిందో? ఏమో? వార్నర్ తీవ్రమైన ఆందోళనలో కనిపించాడు. తాజా సమాచారం అతనికి ఊరటనివ్వడం ఖాయం. ది ఓవల్ మైదానంలో నెట్ ప్రాక్టీస్ సమయంలో గాయపడిన జై కిషన్ కోలుకుంటున్నాడని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నట్టు స్కై స్పోర్ట్స్ ప్రకటించింది. సీటీ స్కాన్‌లో అతని గాయం ప్రమాదకరమైనది కాదని స్పష్టమైనట్టు తెలిపింది. గాయపడిన తర్వాత తొలిసారి రోడ్డుపై నడిచానని, తాను కోలుకుంటున్నానని జై కిషన్ చెప్పినట్టు స్కై స్పోర్ట్స్ వివరించింది. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ అతను కృతజ్ఞతలు తెలిపినట్టు పేర్కొంది. మొత్తానికి ప్రాక్టీస్ సమయంలో గాయపడిన నెట్ బౌలర్ కోలుకుంటున్నాడన్న వార్త ఆస్ట్రేలియా శిబిరానికి ఊరటనిచ్చింది.
నెట్ ప్రాక్టీస్‌లో గాయపడిన జై కిషన్ (ఫైల్)