క్రీడాభూమి

ఆర్చర్ X గేల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్, జూన్ 13: ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే పోరును జొఫ్రా ఆర్చర్, క్రిస్ గేల్ సంగ్రామంగా విశే్లషకులు అభవర్ణిస్తున్నారు. బార్బడాస్‌లో జన్మించిన ఆర్చర్ ఇంగ్లాండ్‌లో స్థిరపడ్డాడు. అక్కడే క్రికెటర్‌గా ఎదిగి, ఇంగ్లాండ్ జట్టులో చోటు సంపాదించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ జరిగింది. అందులో ఇరు జట్లు చెరి రెండు విజయాలు సాధించాయి. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ సిరీస్‌లో గేల్ నాలుగు ఇన్నింగ్స్‌లో 424 పరుగులు సాధించాడు. ఏకంగా 39 సిక్సర్లు బాదాడు. ఆర్చర్ చేరికతో బలపడిన ఇంగ్లాండ్ బౌలింగ్‌ను అతను ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు. ఆర్చర్ అండర్-15, అండర్-17, అండర్-19 జట్లలో ఆడినప్పటి నుంచి విండీస్ ఆటగాళ్లకు, ప్రత్యేకించి కోచ్ ఫ్లాయిడ్ రీఫర్‌కు తెలుసు. అందుకే, ఆర్చర్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశంపై వారికి స్పష్టమైన అవగాహన ఉంది. కాగా, వనే్డ సిరీస్‌లో గేల్‌ను కట్టడి చేయలేకపోయిన ఆర్చర్ వరల్డ్ కప్ వేదికగా ఆ ప్రయత్నాన్ని కొనసాగించనున్నాడు. పదునైన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్న ఆర్చర్‌కు, ఎలాంటి బౌలింగ్‌నైనా తనదైన శైలిలో చిత్తుచేసే గేల్‌కు మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌లో సంకుల సమరం తప్పదనేది వాస్తవం. ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.