క్రీడాభూమి

మాలిక్ కెరీర్‌కు తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జూన్ 17: ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ కెరీర్ ముగిసినట్టేనన్న వాద న బలంగా వినిపిస్తున్నది. భారత్‌తో ఆదివారం జరిగి న ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ గ్రూప్ మ్యాచ్‌లో మొదటి బంతికే ఔటైన మాలిక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వరల్డ్ కప్‌లో 3 మ్యాచ్‌లు ఆడిన అత ను కేవలం 8 పరుగులు చేశాడు. పాక్ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే, దారు ణ వైఫల్యాల నేపథ్యంలో అతనికి మిగతా మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం దక్కడం అనుమానమేనని పాక్ మాజీ స్పిన్నర్ ఇక్బాల్ కాసిం వ్యాఖ్యానించాడు. ఇలావుంటే, 35 టెస్టులు ఆడిన తర్వాత, 2015లో ఆ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌పై దృష్టి కేంద్రీకరిస్తానని మాలిక్ తెలిపాడు. అదే విధంగా ప్రపంచ కప్‌కు ముందు విలేఖరులతో మాట్లాడుతూ వనే్డ ఫార్మాట్‌లో ఇదే తనకు చివరి టోర్నీ అని స్పష్టం చేశాడు. ఆతర్వాత తాను టీ-20 వరల్డ్ కప్‌లో పాక్‌ను గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నాడు. ఇంత వరకూ 287 వనే్డలు ఆడిన మాలిక్ 7,534 పరుగులు చేశాడు. 158 వికెట్లు పడగొట్టాడు. 111 టీ-20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. వనే్డ ఫార్మాట్ నుంచి వైదొలగుతున్నట్టు ఇది వరకే ప్రకటించిన అతనికి టీ-20 ఫార్మాట్‌లో అవకాశం దక్కడం అనుమానమేనని పలువురు పాక్ మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.